MAHESH BABU: రేర్ ఫీట్.. టాలీవుడ్‌లో మహేశ్ సరికొత్త రికార్డు..

మహేష్ నటించిన 11 సినిమాలు యూఎస్‌లో మిలియన్ డాలర్ కలెక్షన్స్ వసూలు చేసాయి. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ హీరోకి లేదు. ఇప్పుడు గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో స్టార్ట్ అయ్యి హై స్పీడ్‌గా బుక్ అవుతుండటంతో మహేష్ మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 1, 2024 | 03:04 PMLast Updated on: Jan 01, 2024 | 3:04 PM

Mahesh Babu Created New Record With Guntur Karam Movie

MAHESH BABU: సూపర్ స్టార్ మహేష్ బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించిన టాప్ స్టార్. లేటెస్ట్‌గా ఆయన నుంచి వస్తున్న మూవీ గుంటూరు కారం. సుమారు ఏడాదిన్నర తర్వాత మహేష్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. జనవరి 12న విడుదల అవుతున్న గుంటూరు కారం ఓవర్సీస్‌లో మాత్రం 11నే విడుదల అవుతుండటంతో మహేష్‌కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మహేష్‌కి ఓవర్సీస్‌లో అదిరిపోయే రికార్డు ఉంది.

Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

మహేష్ నటించిన 11 సినిమాలు యూఎస్‌లో మిలియన్ డాలర్ కలెక్షన్స్ వసూలు చేసాయి. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ హీరోకి లేదు. ఇప్పుడు గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో స్టార్ట్ అయ్యి హై స్పీడ్‌గా బుక్ అవుతుండటంతో మహేష్ మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. యూఎస్‌లో గుంటూరు కారం టాక్‌తో సంబంధం లేకుండా 1 మిలియన్ మార్క్ అందుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో మహేష్ నటించిన 12 సినిమాలు యూఎస్‌లో 1 మిలియన్ మార్క్ అందుకున్నట్లు అవుతుంది. కాగా మహేష్ గుంటూరు కారం సినిమాని పూర్తి చేసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి విదేశాలకి వెళ్ళాడు. త్వరలోనే ఆయన ఇండియాలో అడుగుపెట్టబోతున్నాడు.

ఆ తర్వాత గుంటూరు కారం ప్రమోషన్స్ భారీ ఎత్తున ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా జనవరి 6న ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ట్రైలర్ కూడా ఆరోజే రిలీజ్ అవుతుండటంతో ఇక గుంటూరు కారం గురించే అందరు మాట్లాడుకోవడం ప్రారంభం కాబోతుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.