Mahesh Babu: రాజమౌళి సినిమాకి ముందే మహేశ్ మరో మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

జనవరిలో అనిల్ రావిపూడితో మహేశ్ బాబు కాంబినేషన్ రీపీట్ కానుంది. ఈ కాంబోలో సినిమా సంక్రాంతికి మొదలై, జులైలో పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి. అప్పట్లో సరిలేరు నీకెవ్వరు కూడా 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి షాక్ ఇచ్చాడు అనిల్ రావిపుడి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2023 | 05:38 PMLast Updated on: Sep 29, 2023 | 1:28 PM

Mahesh Babu Doing A Movie With Anil Ravipudi Again

Mahesh Babu: మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా అంటూ రెండు వారాలుగా గుసగుసలొస్తున్నాయి. కాని నిజమా కాదా అన్న డైలామానే పోలేదు. ఐతే ఇప్పుడు ఆల్‌మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. స్టోరీ లైన్ ఓకే అవ్వటమే కాదు. షూటింగ్ షెడ్యూల్, రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా తేల్చేశాడట అనిల్ రావిపూడి. ఇది నిజంగానే షాకింగ్ డెవలప్‌మెంట్. ప్రజెంట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం షూటింగ్‌తో బిజీ అయ్యాడు. అది నవంబర్ ఎండింగ్ లేదంటే డిసెంబర్ సెకండ్ వీక్‌లోగా పూర్తవుతుందట.

సంక్రాంతికి బరిలో దిగటం కూడా ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. సో ఇక సంక్రాంతికి ఇటు గుంటూరు కారం, అటు రాజమౌళి సినిమా లాంచింగ్ అనుకున్నారు. కాని ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. జనవరిలో అనిల్ రావిపూడితో మహేశ్ బాబు కాంబినేషన్ రీపీట్ కానుంది. ఈ కాంబోలో సినిమా సంక్రాంతికి మొదలై, జులైలో పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి. అప్పట్లో సరిలేరు నీకెవ్వరు కూడా 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి షాక్ ఇచ్చాడు అనిల్ రావిపుడి. అయితే ఇక్కడ అసలైన డౌట్లేంటంటే చిరుతో అనిల్ రావిపూడి సినిమా లేదా..? జక్కన్నతో మహేశ్ మూవీ షూటింగ్ ఇంకా డిలే కాబోతోందా..? ఈ డౌట్లకి సరైన సమాధానాలున్నాయి. వశిష్ట మేకింగ్‌లో చిరు కమిటైన సినిమా మొదలై, పూర్తయ్యేందుకు 10 నెలల టైం పడుతుంది.

ఈలోపు మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి సినిమా పూర్తవుతుందట. ఇక రాజమౌళితో మహేశ్ మూవీ మొదలయ్యేది జనవరిలోనే అయినా, మొదటి ఆరునెలలు వర్క్ షాపులే నడుస్తాయి. సో.. రాజమౌళి సినిమా జులై నుంచే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆలోగా మహేశ్ తో అనిల్ మూవీ పూర్తి చేసేస్తాడు.