MAHESH BABU: రాజమౌళి చెప్పిందేంటి.. మహేశ్ చేస్తోందేంటి..?

ఆల్రెడీ కెనడాలో 2 వారాల సెషన్స్ పూర్తి చేసుకున్న మహేశ్, ప్రజెంట్ ఇంట్లోనే వర్కవుట్లు చేస్తున్నాడు. తను కండలు, మీసాలు పెంచమంటే, సినిమాలు చూస్తే, అది బాగుంది, ఇది బాగుంది అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2024 | 08:38 PMLast Updated on: Mar 14, 2024 | 8:38 PM

Mahesh Babu Doing Workouts For Ssmb 29 With Ss Rajamouli

MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా అనగానే, లెక్కలు మారాయి. సూపర్ స్టార్ కూడా తన ఫోకస్ అంతా జక్కన్న సినిమా కోసమే అన్నట్టు డెడికేటెడ్‌గా గెడ్డం, మీసం పెంచి, జర్మనీలో ట్రైనింగులు పూర్తి చేసి, ప్రజెంట్ ఇంటిపట్టునే ఉంటున్నాడు. అది కూడా రాజమౌళి చెప్పడంవల్ల ఇంటి గేటు కూడా దాటకుండా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు.

JD Lakshminarayana: టార్చ్‌లైట్‌.. జేడీ పార్టీకి కేటాయించిన గుర్తు ఇదే..

వర్క్ ఫ్రం హోమ్ అంటే వర్కవుట్లు, డైట్లు ఫాలో అవుతూ ఒక వైపు జుట్టు, గెడ్డం, పెంచటంతోపాటు మరోవైపు కండలు పెంచాలి. ఆల్రెడీ కెనడాలో 2 వారాల సెషన్స్ పూర్తి చేసుకున్న మహేశ్, ప్రజెంట్ ఇంట్లోనే వర్కవుట్లు చేస్తున్నాడు. తను కండలు, మీసాలు పెంచమంటే, సినిమాలు చూస్తే, అది బాగుంది, ఇది బాగుంది అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇదే రాజమౌళిని పరేషాన్ చేస్తోంది. మొన్న ఆలియా భట్ నిర్మించిన పోచర్‌ని చూసి అదిరిపోయిందంటూ ట్వీట్ పెట్టాడు సూపర్ స్టార్. ఇప్పుడు మలయాళ ప్రేమలు మూవీ తెలుగులో చూసి అది కూడా అదిరిపోయిందంటూ ఆకాశానికెత్తాడు. దీంతో ప్రేమలు మూవీకి భీభత్సమైన పబ్లిసిటీ వచ్చినట్టైంది.

ఆలియా భట్ కూడా తను నిర్మించిన పోచర్‌కి కోట్లు పెట్టి చేసినా రాని ప్రచారం, మహేశ్ బాబు ఒక్క ట్వీట్‌తో వచ్చేసింది. ఇలా చూసిన సినిమా నచ్చితే మనస్పూర్తిగా మెచ్చుకోవటం మహేశ్ నైజం. కాకపోతే వీటినే చూస్తూ తనిచ్చిన కండలు పెంచే టాస్క్ ఎక్కడ పక్కన పెడుతాడో అన్నది జక్కన్న టెన్షన్ అనంటున్నారు. ఏదేమైనా మహేశ్ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్స్ హీరో. కాబట్టి జక్కన్న టెన్షన్ పడాల్సిన పనిలేదు.