Bhagavanth Kesari: బాలయ్య సెటైర్.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫైర్..!
14 ఏళ్ల తర్వాత జైలునుంచి రిలీజైన 55 ఏళ్ల ఓ తండ్రి తన కూతురికోసం ఎందరితో ఫైట్ చేస్తోడో అన్నదే కథట. కాకపోతే ఇక్కడ విలన్లు రాబందువులైతే, బంధువులు కూడా విలనీ వేషాల్లో దర్శనమిస్తారట. మాటలతో కాల్చుకుతినే బంధువుల మీద కామెడీ సెటైర్లు ఇందులో బాగా పేల్చాడట.

Bhagavanth Kesari: నటసింహం బాలయ్య సినిమా ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి కోపం కట్టలు తెంచుకునేలా చేసేలా ఉందట. అనిల్ రావిపుడి మేకింగ్‌లో బాలకృష్ణ చేస్తున్న మూవీ భగవంత్ కేసరి. ఈమూవీలో తెలంగాణ అడవి బిడ్డగా బాలయ్య కనిపించబోతున్నాడు.
నైజాం యాసలో మాటల తూటాలు పేల్చాడు. టీజర్‌తో మంచి వైబ్రేషన్స్ వచ్చాయి. కాని, కథతోపాటు కామెడీ సీన్లతోనే వివాదం మొదలయ్యేలా ఉందట. 14 ఏళ్లు జైలుకెళ్లిన ఓ వ్యక్తి తన కూతురి కోసం రాబంధువులతో పోరాడటం వరకు బానే ఉన్నా, బంధువులతో కూడా మానసికంగా పోరాడే సీన్లు వివాదంగా మారే ఛాన్స్ ఉందట. ఆల్రెడీ స్టోరీలైన్ మొత్తం లీకై ఫిల్మ్ నగర్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. 14 ఏళ్ల తర్వాత జైలునుంచి రిలీజైన 55 ఏళ్ల ఓ తండ్రి తన కూతురికోసం ఎందరితో ఫైట్ చేస్తోడో అన్నదే కథట. కాకపోతే ఇక్కడ విలన్లు రాబందువులైతే, బంధువులు కూడా విలనీ వేషాల్లో దర్శనమిస్తారట. మాటలతో కాల్చుకుతినే బంధువుల మీద కామెడీ సెటైర్లు ఇందులో బాగా పేల్చాడట.
అంతవరకు ఓకే.. కానీ ఇక్కడ బంధువుల ఎపిసోడ్ బ్రహ్మోత్సవం మూవీకి స్పూఫ్‌లా ప్లాన్ చేశాడట అనిల్ రావిపుడి. అసలే బ్రహ్మోత్సవం లాంటి మూవీ మహేశ్ కెరీర్‌లోఉందని బాధపడే ఫ్యాన్స్‌కి, మరింత కోపం తెచ్చేలా.. అదే మూవీ మీద అనిల్ రావిపుడి సెటైర్లు ప్లాన్ చేయటం వివాదంగా మారేలా ఉంది. సరిలేరు నీకెవ్వరు మూవీని మహేశ్‌తో తీసిన అనిల్ ఎందుకు ఇలా చేస్తాడనే ప్రశ్నలు ఒకవైపు.. ఒకవేళ స్పూఫ్ చేసినా బ్యాలెన్స్‌డ్ గా చేసుంటాడనే అంచనాలు మరోవైపు ఉన్నాయి. కాని ఫిల్మ్ నగర్లో పేలుతున్న సెటైర్లు చూస్తుంటే, బ్రహ్మోత్సవం స్పూఫ్ ఎపిసోడ్ మంటపెట్టేలా ఉన్నట్టే తెలుస్తోంది.