మహేష్ బాబు ఫ్యాన్స్ గెట్ రెడీ.. SSMB29 టైటిల్, ఫస్ట్ లుక్ డేట్స్ ఫిక్స్..!
SMB29 షూటింగ్ మొదలై చాలా రోజులైంది.. రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసాడు రాజమౌళి. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ మొదలు కానుంది.

Superstar Mahesh Babu has not done a pan India project till now.
SMB29 షూటింగ్ మొదలై చాలా రోజులైంది.. రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసాడు రాజమౌళి. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ మొదలు కానుంది. ఈసారి మరింత భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు. మహేష్ బాబు కూడా మరో పనేది పెట్టుకోకుండా ముందు జక్కన్న సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందా అని ఆశగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేస్తే బాగున్ను అనుకుంటున్నారు వాళ్లు. కానీ జక్కన్న ప్లానింగ్స్ మాత్రం మరోలా ఉన్నాయి. ఆయనేం చేసినా ప్రపంచం మొత్తం చూడాలి అనుకుంటాడు. అందుకే SSMB29 ఫస్ట్ లుక్ కోసం కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ముఖ్యంగా ఎప్పుడు విడుదల చేయాలనే విషయంపై కూడా ఇప్పటికే టీం డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులో ఒక డేట్ వాళ్లు ఫిక్సైపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అది కూడా మహేష్ బాబు అభిమానులకు బాగా ఇష్టమైన డేట్.. సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యే డేట్.
త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది. మరోవైపు SSMB29 షూటింగ్ మొదలయ్యే వరకు ఒక టెన్షన్.. మొదలైన తర్వాత మరో టెన్షన్..! ఏదైనా టెన్షన్ మాత్రం కామన్. ఫస్ట్ లుక్ పక్కనబెడితే.. ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఫ్యాన్స్‌ను కంగారు పెడుతున్నారు మేకర్స్. ఇంతకీ SSMB29కి ఏ టైటిల్ పెట్టబోతున్నారు..? ముందు నుంచి వినిపిస్తున్న టైటిల్స్‌కే ఓటేస్తున్నారా లేదంటే కొత్తదేమైనా ప్లాన్ చేస్తున్నారా.. అని ఆరా తీస్తున్నారు. తన ప్రపంచంలోకి వచ్చిన రోజు నుంచి మహేష్ బాబుకు అస్సలు బ్రేక్ ఇవ్వట్లేదు జక్కన్న. నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో పిచ్చెక్కిస్తున్నాడు. పూర్తిగా హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో రప్ఫాడిస్తున్నారు రాజమౌళి. టాకీ పార్ట్‌ను ఏడాదిలోపే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శక ధీరుడు. కెన్యా, ఆఫ్రికన్ కంట్రీస్ సహా.. 10 దేశాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. అంతేకాదు ఇండియాలో కూడా మేజర్ పార్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నాడు. షూటింగ్ సంగతి అలా ఉంచితే.. ఈ సినిమా టైటిల్ గురించి మొదట్నుంచి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
ఒకప్పుడు రాజమౌళి అంటే కేవలం తెలుగు సినిమా కాబట్టి ఏ టైటిల్ పెట్టినా ఓకే.. కానీ ఇప్పుడలా కాదు ప్యాన్ ఇండియా దాటి ప్యాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు జక్కన్న. అందుకే అందరికీ రీచ్ అయ్యేలా టైటిల్ కోసం వేట సాగుతుందిప్పుడు. SSMB29కి ముందు గరుడ అనే టైటిల్ అనుకున్నారు.. ఆ తర్వాత మహారాజ్ అన్నారు. మళ్లీ అందులో కూడా మహేష్‌లోని MAH.. రాజమౌళిలోని RAJ కలిపి MAHRAJ టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా జనరేషన్ అనే అర్థం వచ్చేలా మరో టైటిల్ చూస్తున్నారు. ప్యాన్ వరల్డ్ కాబట్టి.. ఇలాంటి టైటిల్ అయితే బాగుంటుందని టీం ఆలోచిస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB29 ఫస్ట్ లుక్ ప్లస్ టైటిల్ విడుదల కానున్నాయని తెలుస్తుంది. అంతేకాదు.. మేలోనే సినిమాపై అధికారిక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నాడు దర్శక ధీరుడు.