Mahesh Babu: అంతరిక్షానికి తాకిన మహేష్‌ క్రేజ్‌.. అరుదైన నక్షత్రానికి సూపర్‌స్టార్ పేరు

ఇటు సోషల్ మీడియాలో, అటు ఆఫ్‌లైన్‌లో మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ వైభవంగా జరుగుతున్నాయి. ఐతే అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అనిపించే అద్భుత సంఘటన జరిగింది. మహేష్ బాబు కోసం ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ బర్త్ డే గిఫ్ట్ అందించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 9, 2023 | 03:57 PMLast Updated on: Aug 09, 2023 | 3:57 PM

Mahesh Babu Fans Name A Star After His Name

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌బాబు బర్త్‌ డే వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఘనంగా జరుపుకొంటున్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న మహేష్‌.. ఇప్పుడు గుంటూరు కారం రుచి చూపించబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ ఇండియాను టార్గెట్ చేశాడు.

ఇటు సోషల్ మీడియాలో, అటు ఆఫ్‌లైన్‌లో మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ వైభవంగా జరుగుతున్నాయి. ఐతే అభిమానులందు మహేష్ బాబు అభిమానులు వేరయా అనిపించే అద్భుత సంఘటన జరిగింది. మహేష్ బాబు కోసం ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ బర్త్ డే గిఫ్ట్ అందించారు. మహేష్ బాబు పేరుపై ఏకంగా అంతరిక్షంలో నక్షత్రాన్ని రిజిస్టర్ చేసారు. దీనితో మహేష్ బాబు.. 48వ బర్త్ డేని ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా మార్చేశారు. మహేష్ అభిమానులు చేసిన ఈఘనత చూసి.. టాలీవుడ్ సెలెబ్రటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబుకి, ఆయన అభిమానులకు మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. RA12H33M29S అనే నక్షత్రానికి మహేష్ బాబు పేరు పెట్టారు.

ఈ మేరకు మహేష్ బాబు అభిమానులు స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ నుంచి తమ హీరో పేరుపై సర్టిఫికెట్ కూడా పొందారు. ఈ సర్టిఫికెట్లో ఆ నక్షత్రం వివరాలు ఉన్నాయి. నక్షత్రానికి ఆయన పేరుని రిజిస్టర్ చేయడంతో, మహేష్ బాబు క్రేజ్ అంతరిక్షానికి చేరింది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. టాలీవుడ్ నుంచి గతంలో రాంచరణ్ పేరుపై కూడా నక్షత్రం రిజిష్టర్ అయింది.