MAHESH BABU: మహేశ్ బాబు మీద విషం చిమ్ముతోంది వాళ్లేనా..?

మహేశ్ బాబు మీద కూడా విషం కక్కే ప్రయత్నం మళ్లీ మొదలైంది. అసలు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వస్తోందంటే చాలు.. కొన్ని బ్యాచ్‌లు పనికట్టుకుని నెగెటివ్ ప్రమోషన్ క్రియేట్ చేయటం బిజినెస్ మ్యాన్ టైం నుంచే చూస్తున్నాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 16, 2023 | 05:28 PMLast Updated on: Dec 16, 2023 | 5:28 PM

Mahesh Babu Fans Targeting Guntur Karam

MAHESH BABU: మహేశ్ బాబు సినిమా సంక్రాంతికి రాబోతోంది. గ్లింప్స్ తర్వాత రెండు పాటలతో ఫిల్మ్ టీం ప్రమోషన్ పెంచింది. అంతవరకు బాగానే ఉంది. సరే ఒక పాట మీద భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అది కూడా ఓకే. కానీ, ఇప్పుడు విచిత్రంగా మహేశ్ బాబు మీద కూడా విషం కక్కే ప్రయత్నం మళ్లీ మొదలైంది. అసలు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వస్తోందంటే చాలు.. కొన్ని బ్యాచ్‌లు పనికట్టుకుని నెగెటివ్ ప్రమోషన్ క్రియేట్ చేయటం బిజినెస్ మ్యాన్ టైం నుంచే చూస్తున్నాం.

Ramajogayya Sastry: గుంటూరు కారాన్ని రచయిత మీద చల్లేస్తున్నారా?

ఇప్పుడు అదే జరుగుతోంది. మహేశ్ బాబు ఫోటోని డీపీగా పెట్టుకుని కొన్ని ఎకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే వాళ్లు మహేశ్ అభిమానులే అనేలా ఎకౌంట్ లుక్ ఉంటోంది. తీరా చూస్తే ముందుగా ఇది బాలేదు.. అది బాలేదు.. ఇలా ఉంటే బాగుండు.. ఒక ఫ్యాన్‌గా ఫీల్ అవుతున్నా లాంటి కామెంట్లు పెడుతున్నారు. ఆర్టిఫిషియల్‌గా నెగెటివ్ ప్రమోషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు కారం పాట బాగోలేదని కొందరు రియాక్ట్ అయ్యారనే అభిప్రాయం కూడా పెరుగుతోంది.

నిజానికి జెన్యూన్ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారం రెండో సాంగ్ నచ్చలేదని, డీసెంట్‌గానే లిరిక్స్‌ని తప్పు పట్టారు. కాని ఇంకొందరు హద్దుదాటి అసభ్య పదజాలం వాడారు. అలాంటివాళ్లంతా మహేశ్ యాంటీ ఫ్యాన్స్ అనే వాదన పెరిగింది. కావాలనే మహేశ్ మూవీని డీఫేం చేసేందుకు ఫేక్ ఎకౌంట్స్‌తో ఇలా విరుచుకుపడుతున్నారనే మాట వినిపిస్తోంది.