Mahesh Babu: తమన్ మీద ఎందుకు మహేశ్ కి చిరాకు కలిగింది..? అసలేం జరుగుతోంది?
తమన్ ఓ లేజీ ఫెలో, ఎప్పుడూ క్రికెట్ అడుతాడు, సోషల్ మీడియాలో ఉంటాడు కాని, మ్యూజిక్ మాత్రం త్వరగా కంప్లీట్ చేయడు.. ఇది సర్కారు వారిపాట తర్వాత తమన్ మీద మహేశ్ బాబుకి క్రియేట్ అయిన అభిప్రాయం అంటూ ప్రచారం జరుగుతోంది. సర్కారు వారి పాట మూవీలో తమన్ పనితనం బాగుంది. పాటలు పేలాయి. కాని బ్యాడ్రౌండ్ స్కోర్ సరిగా రాలేదన్నారు. కారణం లేజీగా, ఫోకస్ అంత ఎక్కడో పెట్టి, పనిమీద శ్రద్ద పెట్టకపోవటమే అనేది మేయిన్ కంప్లైట్ అట.

Mahesh Feel Irritate on Thaman
అందుకే త్రివిక్రమ్ ఎంత వారించినా, తన కొత్త మూవీ గుంటూరు కారంకి తమన్ వద్దంటే వద్దని మహేశ్ మంకు పట్టుపడ్డాడని ప్రచారం జరుగుతోంది. కాని ఈలోపు గ్లింప్స్ కి తమన్ మ్యూజిక్ చేశాడు. పాటలు 4 రికార్డ్ చేశాడు. ఇప్పుడు తమన్ ని తప్పించటం కుదరదు.. అందుకే ఈ ఒక్కసారికి తమన్ ని భరించమని మహేశ్ ని త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేశాడట.
ఈనెల 31న గుంటూరు కారం టీజర్ రాబోతోంది. దానికి మ్యూజిక్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తే ఓకే, లేదంటే నిర్ధాక్షిన్యంగా తమన్ ని పక్కన పెట్టి జస్టిన్ ప్రభాకర్ ని తీసుకోవాలనుకుంటున్నారట. ఇది మహేశ్ బాబు ఫైనల్ గా త్రివిక్రమ్ కి ఇచ్చిన అల్టీ మేటమ్.