GUNTUR KAARAM: మహేష్ సునామీ.. ప్రభాస్ స్పీడుకు బ్రేకులు వేసిన సూపర్ స్టార్

మొన్న గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో పేరు పెట్టడానికి కూడా వీలులేని స్థాయిలో రికార్డు వ్యూస్ సాధించింది. కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్‌లోనే 39 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకొని ప్రేక్షకుల్లో మహేష్ స్టామినాకి ఉన్న పవర్ తెలియచేస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2024 | 01:14 PMLast Updated on: Jan 09, 2024 | 1:14 PM

Mahesh Babu Guntur Kaaram Movie Breaks Salaar Record In Youtube

GUNTUR KAARAM: అదేంటోగాని సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు వచ్చినా కూడా అంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని ఒక మూలన పడేసేలా చెయ్యడమే పనిగా పెట్టుకుంటాడు. ఇప్పుడు కూడా.. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అనే రీతిలో గుంటూరు కారంతో నయా రికార్డుని సృష్టించాడు. దీంతో తెలుగు చిత్ర సీమలో ఇప్పటివరకు ఉన్న పలు యూట్యూబ్ రికార్డులన్నీ తమంతట తాముగా పక్కకి తప్పుకుంటున్నాయి.

Kodi Pandelu : కోడి పందేలకు బౌన్సర్లు ! గొడవలు పెట్టుకుంటే అంతే !

మొన్న గుంటూరు కారం మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇలా రిలీజ్ అయ్యిందో లేదో పేరు పెట్టడానికి కూడా వీలులేని స్థాయిలో రికార్డు వ్యూస్ సాధించింది. కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్‌లోనే 39 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకొని ప్రేక్షకుల్లో మహేష్ స్టామినాకి ఉన్న పవర్ తెలియచేస్తుంది. పైగా ఇప్పటి వరకు వచ్చిన అన్ని తెలుగు మూవీ ట్రైలర్స్‌కి వచ్చిన వ్యూస్ కంటే గుంటూరు కారం మూవీకే ఎక్కువ వ్యూస్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. బాబు ల్యాండ్ అయ్యాడంటే అపోజిషన్‌కి బాండే అంటు సంబరాల్లో మునిగిపోయారు ఫ్యాన్స్. గుంటూరు కారం ట్రైలర్ చూస్తుంటేనే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే చిత్రంగా త్రివిక్రమ్ తెరకెక్కించినట్టు చాలా క్లియర్‌గా అర్ధం అవుతుంది.

అలాగే మహేష్ కూడా వీర లెవల్లో విజృంభణ చెయ్యటం కూడా ఖాయమని తేలిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ నటించిన సలార్ ట్రైలర్ 32.6 మిలియన్ వ్యూస్‌తో ఇప్పటివరకు ముందంజలో ఉంటే గుంటూరుకారం ఆ రికార్డుని పక్కకి నెట్టి ఇప్పుడు 39 మిలియన్స్ వ్యూస్‌తో టాప్‌లో నిలిచింది. సో.. ఈ సంక్రాంతికి మహేష్ సునామీ పక్కా అని అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.