KURCHI MADATHA PETTI: న్యూ ఇయర్ ట్రీట్.. ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్.. మాస్ స్టెప్స్‌తో కుమ్మేసిన మహేష్

లేటెస్ట్‌గా రిలీజైన కుర్చీ మడతపెట్టి అనే సాంగ్‌లో మాస్ స్టెప్స్‌తో మెస్మరైజ్ చేశాడు. లేడీ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీలతో కలిసి మహేష్ వేసిన మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతికి థియేటర్లలో ఈ పాటకు విజిల్సే విజిల్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 06:51 PMLast Updated on: Dec 30, 2023 | 6:51 PM

Mahesh Babu Impressed By Dance In Kurchi Madatha Petti

KURCHI MADATHA PETTI: టాలీవుడ్‌లో చాలామందే డ్యాన్సింగ్ స్టార్స్ ఉన్నారు. అయితే.. ఆ లిస్టులో మనకు మహేష్ బాబు కనిపించడు. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టుగా డ్యాన్సుల్లో ఇరగదీసిన మహేష్.. పెద్దైన తర్వాత డ్యాన్సులపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. తన డైలాగ్స్, స్టైల్, స్వాగ్, ఫైట్స్ వంటి వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అయితే.. లేటెస్ట్‌గా గుంటూరు కారం మూవీలో స్టెప్స్‌తో ఇరగదీశాడు. లేటెస్ట్‌గా రిలీజైన కుర్చీ మడతపెట్టి అనే సాంగ్‌లో మాస్ స్టెప్స్‌తో మెస్మరైజ్ చేశాడు.

GUNTUR KARAM: ఆ పాటని కుర్చీ మడత పెట్టి తిట్టేస్తున్న ఫ్యాన్స్

లేడీ డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీలతో కలిసి మహేష్ వేసిన మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతికి థియేటర్లలో ఈ పాటకు విజిల్సే విజిల్స్. ‘రాజమండ్రి రాగమంజరి.. మా అమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రి.. కళాకారుల ఫ్యామిలీ మరి.. నేను గజ్జె కడితే నిదురపోదు నిండు రాతిరి..‘ అంటూ శ్రీలీల మాస్ అవతార్ లో రెచ్చిపోతే.. ‘సోకులాడి స్వప్న సుందరి.. నీ మడత చూపు మాపటేల మళ్లె పందిరి.. ‘ అంటూ మ..మ.. మాస్ అవతార్ లో మహేష్ ఈ పాటలో మరింత రెచ్చిపోతున్నాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ మాస్ గీతాన్ని సాహితీ చాగంటి, శ్రీకృష్ణ ఆలపించారు. తమన్ సంగీతాన్నందించిన ఈ మెంటల్ మాస్ సాంగ్.. ట్రెండింగ్ లోకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు టైం దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా అవి అభిమానులను నిరాశపర్చాయి.

దీంతో మూడో మాటను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంటుంది. హై వోల్టేజీ తో కూడిన స్పైపీ, మాస్, హాట్ కలగలిపిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.