ప్రభాస్ ఫ్యాన్స్‌కు 2000 కోట్ల న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో తాను ఏంటి అనేది పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కల్కి సినిమా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ రికార్డులను కొల్లగొట్టింది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో తాను ఏంటి అనేది పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కల్కి సినిమా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ రికార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో బాలీవుడ్ జనాలకు పక్కా బొమ్మ కనపడింది. ప్రభాస్ ను తక్కువ అంచనా వేసిన వాళ్ళు అలాగే ప్రభాస్ పని అయిపోయిందని వెకిలిగా వెటకారంగా మాట్లాడిన వాళ్లకు కల్కి క్రియేట్ చేసిన రికార్డులు చంప దెబ్బ కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చాయి.
1200 కోట్లకు పైగా కలెక్షన్స్ కాబట్టి ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిన. ఆ సినిమాపై ఎవరు ఎన్ని విధాలుగా నెగిటివ్ ప్రచారం చేసిన సినిమాలో విషయం ఉండటంతో మౌత్ పబ్లిసిటీ కూడా బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కల్కి పార్ట్ 2 కోసం జనాలు పిచ్చిపిచ్చిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగా కొంత పూర్తయిందని నిర్మాతలు కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక మిగిలిన షూటింగ్ని 2026లో కంప్లీట్ చేసి 2027లో సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్టర్ పట్టుదలగా ఉన్నాడు.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు నాగ్ అశ్విన్. కృష్ణుడి పాత్రకు టాలీవుడ్ లో ఏ హీరోని మీరు సెలెక్ట్ చేస్తారని ఒక అభిమాని క్వశ్చన్ చేయగా.. కల్కి యూనివర్స్ లో కృష్ణుడి పాత్రధారి ముఖం కనిపించకూడదని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పూర్తిస్థాయి పాత్రలో మహేష్ బాబు నటిస్తే మాత్రం అభిమానులకు పండగే అనుకుంటా.. టీజర్ రిలీజ్ కి ముందే ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచిపోతుందని కామెంట్ చేశాడు. ఖలేజా సినిమాలో మహేష్ బాబు రోల్ తనకు ఎంతో నచ్చిందని దేవుడు లాంటి క్యారెక్టర్ తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇక రెండు పార్ట్ లుగా కలిగి సినిమా రావడంపై యంగ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.
కథను బట్టి మార్పులు ఉంటాయని కొందరు రెండు పార్ట్ లు ఒకటేసారి కంప్లీట్ చేస్తారని కాబట్టి బడ్జెట్ విషయంలో పెద్ద ప్రాబ్లం ఉండదని కానీ కల్కి విషయానికొస్తే మాత్రం చిట్టీలు వేసి రెండు భాగాలుగా షూట్ చేశామని చెప్పుకొచ్చాడు. పెద్ద కథ సింగిల్ పార్ట్ అనే ఆలోచనతోనే.. టీమంతా పనిచేస్తూ వచ్చామని కానీ ఇది రెండు రెండు పార్ట్ లు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదని ఆ తర్వాత విషయం అర్థమై ప్రభాస్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ షూటింగ్ విషయంలో ప్రభాస్ లేకుండానే కొంత పార్ట్ ను కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలతో బిజీ బిజీగా ఉండటంతో ఈ సినిమా లేటవుతుంది.