Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు కాంబినేషన్ రిపీట్ కానుందా..?

జనవరిలో లాంచింగ్, వర్క్ షాపులు కష్టమని ఈ గ్యాప్‌ని వాడేసుకోవాలని మహేశ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారం డిసెంబ‌లోగా పూర్తైనా, జనవరి నుంచి వచ్చే దీపావళి వరకు మహేశ్ బాబు ఖాలీగా ఉండాల్సి వస్తుంది. అందుకే అనిల్ సుంకరకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడట మహేశ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2023 | 06:45 PMLast Updated on: Sep 19, 2023 | 6:45 PM

Mahesh Babu Is Doing A Film With Anil Sunkara And Anil Ravipudi

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి మూవీ జనవరిలో మొదలై, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అన్నారు. కాని జూన్ కాస్త నవంబర్‌కి మారేలా ఉంది. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబు, గుంటూరు కారం తర్వాత మరో మూవీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడట. విజయేంద్ర ప్రసాదేమో కథ సిద్దం.. ఇక జనవరి నుంచి వర్క్ షాపులన్నాడు. కానీ, సీన్ చూస్తే.. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేందుకు ఇంకా టైం పట్టేలా ఉందట. హాలీవుడ్ బ్యానర్లతో డీల్ సెట్ అయ్యాకే వర్క్ షాపంటూ ప్రచారం జరుగుతోంది.

లేదు.. వర్క్ షాప్‌ని షురూ చేసి, ఈలోగా హాలీవుడ్ బ్యానర్లతో టై అప్ అవ్వొచ్చు కదా అంటే కుదిరేలా లేదు. ఎందుకంటే ఒక సారి స్క్రిప్ట్ లాక్ చేశాక మార్పులంటే జక్కన్న డిక్షనరీలోనే అలాంటి పదాలుండవు. కాబట్టే స్క్రిప్ట్ లాక్ కాకముందే హాలీవుడ్ బ్యానర్లతో టై అప్ అయ్యి, ఆ తర్వాతే వర్క్ షాపులు షురూ చేయాలనేది జక్కన్న ఐడియా అని తెలుస్తోంది. ఇలా అయితే జనవరిలో లాంచింగ్, వర్క్ షాపులు కష్టమని ఈ గ్యాప్‌ని వాడేసుకోవాలని మహేశ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారం డిసెంబ‌లోగా పూర్తైనా, జనవరి నుంచి వచ్చే దీపావళి వరకు మహేశ్ బాబు ఖాలీగా ఉండాల్సి వస్తుంది. అందుకే అనిల్ సుంకరకి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడట మహేశ్. ఐతే అనిల్ రావిపుడి మేకింగ్‌లో మహేశ్ ఈ ప్రాజెక్ట్ చేస్తాడని తెలుస్తోంది.

చిరుతో అనిల్ సినిమా ఓకే అయినా, అది పట్టాలెక్కడానికి ఏడాదికి పైనే టైం పట్టేలా ఉంది. ఈలోపు మెగాస్టార్ తన సోషియో ఫాంటసీ మూవీ పూర్తి చేస్తాడు కాబట్టే, అనిల్ రావిపుడితో మహేశ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. ఏజెంట్, భోళా శంకర్ ఫ్లాపులతో డీలా పడ్డ అనిల్ సుంకరకి మహేశ్, అనిల్ కాంబోలో సినిమా ఛాన్స్ దొరకటం అంటే నిర్మాతగా గట్టెక్కినట్టే.