MAHESH BABU: అమెరికాకి మహేష్.. తిరిగొచ్చి గుంటూరు కారం ప్రమోషన్

గుంటూరుకారం షూటింగ్‌ పూర్తికాకపోవడంతో.. ఈసారి క్రిస్మస్‌ను ఇంట్లోనే జరుపుకుని న్యూఇయర్‌ను అమెరికాలో జరుపుకోనున్నాడు మహేశ్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 24, 2023 | 05:35 PMLast Updated on: Dec 24, 2023 | 5:35 PM

Mahesh Babu Is Going To Us For New Year Celebrations

MAHESH BABU: క్రిస్మస్‌.. న్యూ ఇయర్‌ కలిసొచ్చేలా హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవడం మహేశ్‌ బాబుకు అలవాటు. అయితే ఈసారి క్రిస్మస్‌ మిస్‌ అయినా.. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం అమెరికా వెళ్లిపోతున్నారు. క్రిస్మస్‌.. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను ఫారిన్‌లో జరుపుకోవడం మహేశ్‌కు అలవాటైపోయింది. గుంటూరుకారం షూటింగ్‌ పూర్తికాకపోవడంతో.. ఈసారి క్రిస్మస్‌ను ఇంట్లోనే జరుపుకుని న్యూఇయర్‌ను అమెరికాలో జరుపుకోనున్నాడు మహేశ్‌.

SALAAR: ఆర్ఆర్ఆర్‌ని దాట లేకపోయిన సలార్.. అదే కారణమా..?

కొడుకు గౌతమ్‌ ఈమధ్యనే న్యూయార్క్‌లో డిగ్రీలో జాయిన్‌ అయ్యాడు. దీంతో అక్కడే న్యూ ఇయర్ సెల్రబేషన్స్‌ ప్లాన్‌ చేశాడు మహేశ్‌. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో ప్రస్తుతం మహేశ్‌, శ్రీలీలపై సాంగ్‌ తీస్తున్నారు. 26 నాటికి ఈ పాటతోపాటు షూటింగ్‌ కూడా పూర్తవుతుంది. 27న బయలుదేరి అమెరికా వెళ్లి.. 5న ఇండియా తిరిగొస్తాడు మహేశ్‌. వచ్చీరాగానే.. గుంటూరుకారం వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటాడు. సినిమా 12న రిలీజ్‌ అవుతోంది. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను ఫారిన్‌లో జరుపుకోవడం మహేశ్‌ టాలీవుడ్‌కు అలవాటు చేశాడు.

మహేశ్‌లాగే ఎన్టీఆర్ కూడా ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు. కంటిన్యూస్‌గా దేవర షూటింగ్‌లో వున్న ఎన్టీఆర్‌.. ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ వెళ్తున్నాడు. వచ్చీరాగానే.. జనవరి ఫస్ట్ వీక్‌లో షూటింగ్‌లో పాల్గొంటాడు తారక్‌. సినిమా ఏప్రిల్ 5న రిలీజ్‌ వుతోంది. షూటింగ్‌ లేకపోతే.. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్లడం కామనైపోయింది. మరి రామ్‌చరణ్‌, బన్నీ ఎక్కడకు ప్లాన్‌ చేశారోగానీ.. ఈ ఇద్దరి సినిమాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకోవడం లేదు.