MAHESH BABU: సూపర్ స్టార్ ఏం నేర్చుకున్నాడు.. ఇంకేం నేర్చుకోవాలి..?
రాజమౌళి డైరెక్షన్‌లో తను చేయబోయే మూవీలో చాలా సాహసాలు చేయాలి. చల్లటి ప్రాంతాలు, కొండలు, కోనలు.. ఇలా చాలా ఎక్కాలి. అన్నీ గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్‌లో చేద్దామంటే కుదరదు. అందుకే కొండలెక్కే ట్రెక్కింగ్ నుంచి ఐస్ మీద జారే స్కేటింగ్ వరకు మహేశ్ నేర్చుకున్నాడు.
MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు యూరప్‌లో స్కేటింగ్ నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. కత్తి యుద్దాలు, కర్ర సాముతోపాటు చల్లటి ఐస్ వాటర్‌లో ఎక్కువ సేపు ఉండగలగటం, అందులో ఈతకొట్టినా శరీరాన్ని వేడిగా ఉంచుకోవటం లాంటి అథ్లెటిక్స్ ఫాలో అయ్యే టెక్నిక్స్ నేర్చుకున్నాడు. తనేమైనా ఒలంపిక్స్‌లో పోటీ పడబోతున్నాడా అంటే, అలాంటిదేం లేదు.
Jr NTR: చిక్కుల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్.. తప్పించుకోగలడా..?
కానీ, అలాంటి శిక్షణే మహేశ్‌కి అవసరమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో తను చేయబోయే మూవీలో చాలా సాహసాలు చేయాలి. చల్లటి ప్రాంతాలు, కొండలు, కోనలు.. ఇలా చాలా ఎక్కాలి. అన్నీ గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్‌లో చేద్దామంటే కుదరదు. అందుకే కొండలెక్కే ట్రెక్కింగ్ నుంచి ఐస్ మీద జారే స్కేటింగ్ వరకు మహేశ్ నేర్చుకున్నాడు. ప్రస్థుతానికి ఒక సెషన్ పూర్తైంది. ఇంకా ఇలాంటి సెషన్లు మూడు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గుర్రపు స్వారీ విషయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మహేశ్‌కి సాయం చేయబోతున్నాడు. తనకి కొన్ని కిటుకులు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా మహేశ్ జుట్టు మరింత పెంచాక దాన్ని వాళ్లనుకున్న లుక్‌కి అనుగునంగా కత్తిరిస్తారట.
కొత్త లుక్‌లో మహేశ్ కనిపిస్తాడట. ఏదేమైనా యూరప్‌లో తక్కువ సమయంలో చాలా నేర్చుకున్న మహేశ్, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. గుర్రపు స్వారీ మీద పట్టు, అలాగే కొరడాని బాగా వాడటం, దీంతో పాటు డబుల్ బ్యారల్ గన్ వాడటం, ఇలా చాలా స్కిల్స్ సినిమా కోసం నేర్చుకోవాల్సి వస్తోంది.