Mahesh Babu: పవర్ స్టార్ బ్యాచ్ తో కబడ్డీ ఆడబోతున్న సూపర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీం కబడ్డి ఆడితే ఎలా ఉంటుంది.. అది కూడా గుంటూరు కారం సెట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పవన్ స్టార్ టీం కబడ్డి ఆడితే, ఫ్యాన్స్ కి పండగ.. బాక్సాఫీస్ కి కాసుల పండగ..అదే జరిగేలా ఉంది. ఈ మొత్తం సీన్ సెట్ అవటానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమే కారణం.

Mahesh Babu is planning to play kabaddi with superstar Gabbar Singh kabaddi batch in Guntur
గుంటూరు కారం ప్రజెంట్ షెడ్యూల్ వేగంగా పూర్తి కాబోతోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో మహేశ్ బాబు కబడ్డీ సీన్ ని ప్లాన్ చేశాడట. కబడ్డి అనగానే ఒక్కడులో కబడ్డి బ్యాక్ డ్రాప్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి ఎంతకలిసొచ్చిందో, వసూళ్లతో క్రియేట్ అయిన హిస్టరీనే చెబుతోంది.
అలాంటి సీన్ లోకి పవర్ స్టార్ టీం తోడైతే.. ఆలెక్కే వేరు. గబ్బర్ సింగ్ లో కూడా పవన్ విలన్ బ్యాచ్ తో కబడ్డి ఆడే సీన్ పేలింది. అలాంటి సీనే గుంటూరుకారంలో త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. కాకపోతే గబ్బర్ సింగ్ లోని అంతాక్షరీసీన్ లో నటించిన బ్యాచే గుంటూరు కారంలో కబడ్డి ఆటతో ప్లాన్ చేసిన యాక్షన్ సీన్ లో నటించబోతోందట. సో ఇక్కడ గబ్బర్ సింగ్ సీనే మరో కోణంలో సూపర్ స్టార్ చేస్తే ఎలా ఉంటుందో, అది మనకు చూపించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏదేమైనా హరీష్ శంకర్ సలాహ తోనే ఈ సీన్ ని డిజైన్ చేశాడట మాటల మాంత్రికుడు.