Devara: దేవరకు మహేష్‌బాబు బిగ్‌ హెల్ప్‌.. ఎన్టీఆర్ మూవీ కోసం ఏం చేస్తున్నాడంటే

దేవరలో మహేష్‌బాబు కూడా భాగం కాబోతున్నాడు. ఇదే నిజం అయితే.. అభిమానులకు పూనకాలు ఖాయం. దేవర సినిమాకు మాట సాయం చేయనున్నాడట మహేష్. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2023 | 02:33 PMLast Updated on: Jun 29, 2023 | 2:33 PM

Mahesh Babu Lendign His Voice To Ntr Devara

Devara: ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇద్దరిదీ హింట్ కాంబో కావడం, అదీ ట్రిపుల్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఫ్యాన్స్‌ను హాంట్‌ చేస్తోంది. చీకట్లో షూటింగ్.. సైఫ్‌ అలీఖాన్‌తో ఫైటింగ్.. ఇలా బయటకు వచ్చిన లీక్స్ ఇప్పటికే క్రేజీ అనిపిస్తోంది.

దేవర.. ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ అయింది. జాన్వి కపూర్‌ ఫస్ట్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుండగా.. రష్మిక, మృణాల్‌లో ఒకరిని సెకండ్ హీరోయిన్‌గా తీసుకోబోతున్నాడు కొరటాల. సాయిపల్లవి కూడా యాక్ట్ చేస్తుందని ఈ మధ్య గాసిప్స్ వినిపించగా మూవీ టీమ్‌ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు మరో అప్డేట్‌ తారక్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. దేవరలో మహేష్‌బాబు కూడా భాగం కాబోతున్నాడు. ఇదే నిజం అయితే.. అభిమానులకు పూనకాలు ఖాయం. దేవర సినిమాకు మాట సాయం చేయనున్నాడట మహేష్. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మళ్లీ ఇన్నాళ్లకు మహేష్.. ఎన్టీఆర్ కోసం మాట సాయం చేయనున్నారట.

ఈ సినిమా సార్టింగ్‌లో మహేష్ మాట అందించడానికి సై అన్నారట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అభిమానులకి పూనకాలు కన్ఫార్మ్. దేవర సినిమా హిట్ అవ్వడానికి కొరటాల అన్ని ప్లాన్స్ వేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో మహేష్‌కు మంచి రిలేషన్ ఉంది. గతంలో మహేష్ పిలిచాడు అని భరత్‌ అనే నేను సినిమాకు తారక్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లాడు. ఎన్టీఆర్ పిలిచాడని.. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో మహేష్‌ పార్టిసిపేట్‌ చేశాడు. ఇక అటు కొరటాలతోనూ మహేష్‌కు మంచి ర్యాపో ఉంది.

మహేష్‌తో కొరటాల తీసిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా.. భరత్‌ అనే నేను సూపర్ హిట్ అయింది. ఒకరకంగా కొరటాల, ఎన్టీఆర్‌.. మహేష్‌కు చాలా దగ్గర. ఈ ఇద్దరి కోసం మాట సాయం చేసేందుకు మహేష్ ఒప్పుకున్నాడట. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తారక్, మహేష్ అభిమానుల్లో సంతోషం అంతా ఇంతా కాదు.