SSMB28: గుంటూరు కారంలో వరంగల్ పౌరుషం..? ఫిక్స్ అయ్యాక కంగారు..?
ఆ మధ్య యంగ్ హీరో రామ్ ఒంగోలు గిత్త అంటూ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. కథంతా మిర్చి యార్డ్ చుట్టూనే తిరుగుతుంది. విచిత్రం ఏంటంటే అదే కథని త్రివిక్రమ్ తన స్టైల్లో లిఫ్ట్ చేశాడట.
SSMB28: మహేశ్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా టైటిల్ గుంటూరు కారంగా ఫిక్స్ అవ్వాల్సిందే. కారణం ఫిల్మ్ టీం వదిలిన పోస్టర్‌లో ఎగిరి పడిన ఎర్ర మిరపలు ఉన్నాయి. వెనక మిర్చీ యార్డ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కాదు ఫిల్మ్ నగర్‌లో ఈ సినిమా మీద లీకుల షాకులు పెరిగాయి. ఆ మధ్య యంగ్ హీరో రామ్ ఒంగోలు గిత్త అంటూ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు.
కథంతా మిర్చి యార్డ్ చుట్టూనే తిరుగుతుంది. విచిత్రం ఏంటంటే అదే కథని త్రివిక్రమ్ తన స్టైల్లో లిఫ్ట్ చేశాడట. ఆ మధ్య లీడర్ చేయాల్సిన మహేశ్ అది చేయకపోవటం, తర్వాత అలాంటి కథతోనే కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తీశాడు. గుంటూరు కారం పరిస్థితి కూడా అలానే ఉంది. ఒంగోలు గిత్త ఒకప్పుడు మహేశ్ విని, రిజెక్ట్ చేసిన కథే. ఇప్పుడు త్రివిక్రమ్ అలాంటి కథనే, తన స్టైల్లో రెడీ చేస్తున్నాడని టాక్.