SSMB28: మహేశ్ బాబు ఇచ్చిన 3 కత్తుల మీద కూర్చున్న త్రివిక్రమ్

అంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ దగ్గర ఈ మూవీ తాలూకు పూర్తి స్కిప్ట్ లేదా అన్న డౌట్ రావొచ్చు.. ఆ డౌట్ నిజమే.. కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షెడ్యూల్ గ్యాప్ మధ్యలో కథలో మార్పులు చేసుకుంటూ రాసుకుంటూ పోతున్నాడట మాటల మాంత్రికుడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 20, 2023 | 05:28 PMLast Updated on: May 20, 2023 | 5:28 PM

Mahesh Babu Orders Trivikram Srinivas About Ssmb28

SSMB28: సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడికి మూడు కత్తులు గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఇక మీదట తనతో మూవీ చేయాలంటే వాటి మీద కూర్చునే డైరెక్షన్ చేయాలట.. తప్పని పరిస్థితుల్లో త్రివిక్రమ్, ఇప్పుడా మూడు పదునైన కత్తుల మీదే కూర్చోవాల్సి వస్తోందట. మహేశ్ పెట్టిన మూడు కండిషన్లే త్రివిక్రమ్ పాలిట కత్తుల్లా గుచ్చుకుంటున్నాయట. అన్నిటికంటే ముఖ్యమైన కండిషన్ కథని రెండో సారి కూడా మార్చి కొత్త కథతో రావడం.. లేదంటే జూన్ 5 లోగా బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావడం.

అంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్ దగ్గర ఈ మూవీ తాలూకు పూర్తి స్కిప్ట్ లేదా అన్న డౌట్ రావొచ్చు.. ఆ డౌట్ నిజమే.. కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షెడ్యూల్ గ్యాప్ మధ్యలో కథలో మార్పులు చేసుకుంటూ రాసుకుంటూ పోతున్నాడట మాటల మాంత్రికుడు. ఇక మహేశ్ పెట్టే రెండో కండీషన్.. 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం. కాని అది ఎలా సాధ్యం..? మహేశ్ షూటింగ్ ఆపటంతో షెడ్యూల్స్ వృథా అయ్యాయి. దీంతో చాలా మంది డేట్లు వృథా అయ్యాయి. ఇప్పుడు మళ్లీ 90 రోజుల షూటింగ్ కోసం పూజా హెగ్డే నుంచి విలన్ల వరకు చాలా మంది డేట్లు షెడ్యూల్‌కు అనుగుణంగా మార్చటం అసాధ్యం. ఒకవేళ అలా జరిగితే.. డేట్లు సెట్ కాని వాళ్లను తీసేసి, వేరే వాళ్లను తీసుకోమన్నది మహేశ్ కండిషన్.

డేట్లు కుదరకపోతే చివరకు హీరోయిన్‌ను కూడా తీసేయమన్నారట. ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్టు రెడీ చేయడం లేదా కథ మార్చడం, 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం, నటీనటుల డేట్స్ తీసుకోవడం త్రివిక్రమ్‌కు కత్తిమీద సామే.