MAHESH BABU: ఇద్దర దర్శకులకు మహేశ్ గ్రీన్ సిగ్నల్.. రాజమౌళి సినిమా తర్వాత వీళ్లతోనే..!
రాజమౌళితో సినిమా ఇంకా సెట్స్ పైకెళ్లలేదు. అంతలోనే మహేశ్ బాబు మరో సినిమాకు ప్లానింగ్ రెడీ చేశాడు. ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాళ్లే సందీప్ రెడ్డి వంగ, సుకుమార్. రాజమౌళి డైరెక్షన్‌లో ఏ హీరో మూవీ చేసినా హిట్ వస్తుంది.

Does Guntur Karam superstar hero Mahesh Babu have this problem..?
MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు పాన్ వరల్డ్ మూవీకోసం రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 9 న కాకుండా మహేశ్ బర్త్ డే అయిన ఆగస్ట్ 9న రాజమౌళి సినిమా ఎనౌన్స్‌మెంట్ వస్తుందనే మాట ఫైనలైంది. సరే.. అదెప్పుడొస్తుంది..? సినిమా ఎన్నడు సెట్స్ పైకెళ్లి.. ఎప్పుడొస్తుందనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఈ ప్రచారం కామన్. అయితే రాజమౌళితో సినిమా ఇంకా సెట్స్ పైకెళ్లలేదు.
Anasuya Bharadwaj: పవన్‌కి సపోర్ట్.. పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా.. యాంకర్ అనసూయ
అంతలోనే మహేశ్ బాబు మరో సినిమాకు ప్లానింగ్ రెడీ చేశాడు. ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాళ్లే సందీప్ రెడ్డి వంగ, సుకుమార్. రాజమౌళి డైరెక్షన్‌లో ఏ హీరో మూవీ చేసినా హిట్ వస్తుంది. ఓరేంజ్‌లో ఇమేజ్ పెరుగుతుంది. కాని ఆ తర్వాత పెరిగిన ఇమేజ్‌కి తగ్గ సినిమా చేయలేక రాజమౌళి హీరోలకు డిజాస్టర్ వచ్చి పడుతుంది. ఆ ఇబ్బంది రాకూడదనే, రాజమౌళి మూవీ సెట్స్ పైకెళ్లకముందే మహేశ్ బాబు ఆ తర్వాత ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడు. స్పిరిట్ మూవీతోపాటు యానిమల్ పార్క్ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఆతర్వాత మహేశ్ బాబు సినిమా చేసే ఛాన్స్ ఉందట. బన్నీతో సందీప్ సినిమాలేకపోతే ముందుగా మహేశ్‌తో, సందీప్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. నిజానికి యానిమల్ కథ మహేశ్ కోసం రెడీ చేస్తే తను నో చెప్పటం వల్లే బాలీవుడ్ వెళ్లాల్సి వచ్చింది.
పుష్ప కథ మహేశ్ చేయకపోవటం వల్లే బన్నీ దగ్గరకు వెళ్లిందంటారు. అలాంటి మూవీ తీసిన సుకుమార్‌కి కూడా మహేశ్ ఆఫర్ ఇచ్చాడట. సందీప్ లేదా సుకుమార్.. ఇద్దరిలో ఎవరి కథ ముందు రెడీ అయితే, వాళ్లతో మహేశ్ మూవీ పట్టాలెక్కుతుంది. అలా రాజమౌళి సినిమా చేసిన తర్వాత సుకుమార్, సందీప్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు మహేశ్ బాబు.