Mahesh Babu: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ని విడగొట్టిన మహేశ్ బాబు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎలాంటి స్నేహితులో, మాటల మాంత్రికుడిని పవన్ ఫ్రెండ్ గానే కాదు గురువులా ఎలా చూస్తాడో అందరికీ తెలిసిందే. అలాంటి ఈ ఇద్దరు విడిపోవటానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు కారణమౌతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎలాంటి స్నేహితులో, మాటల మాంత్రికుడిని పవన్ ఫ్రెండ్ గానే కాదు గురువులా ఎలా చూస్తాడో అందరికీ తెలిసిందే. అలాంటి ఈ ఇద్దరు విడిపోవటానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు కారణమౌతున్నాడు. ప్రత్యక్షంగా ఈ ఇద్దరినీ విడిగొట్టలేదు మహేశ్..
కాని మహేశ్ ఫ్యాన్స్ వల్లే త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ ని కలవనంటున్నాడట. ఏడాది వరకు పవన్ సంబంధించిన ఏ ఫంక్షన్ లోకాని, అఫీషియల్ ఈవెంట్ లో కాని త్రివిక్రమ్ ఇక మీదట కనిపించట.
కారణం మహేశ్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమానే.
మహేశ్ తో మాటల మాంత్రికుడు తీస్తున్న సినిమా ఆగస్ట్ 11 న విడుదలయ్యే లా ప్లాన్ చేశారు. సో ఈ మూవీ విడుదలయ్యే వరకు పవన్ తో త్రివిక్రమ్ దూరం మేయింటేన్ చేస్తాడట. పవన్,మహేశ్ మధ్య మంచి స్నేహమే ఉంది. కాని అభిమానుల్లో ఎలాంటి అలజడులు ఉండకూడదని, మహేశ్ మూవీ తీస్తూ, పవన్ సినిమా కోసం కథలు, మాటలు రాసినా, పవర్ స్టార్ మూవీ ప్రమోషన్స్ లోఉన్నా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అందుకని అనవసరంగా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వైరం ఉండకూడదనే ఇలా నిర్ణయం తీసుకున్నాడట. లేదంటే ఆమధ్య అన్ స్టాపబుల్ షోలో పవన్ తో కలిసి త్రివిక్రమ్ వచ్చే వాడట.. కావాలనే, క్రిష్ నిపంపి త్రివిక్రమ్ దూరంగా ఉన్నాడట.