మిస్ వరల్డ్ తో కుర్చీ మడతపెడుతున్న.. సూపర్ స్టార్ మహేశ్ బాబు…

సూపర్ స్టార్ మహేశ్ బాబు మొన్నామధ్య కుర్చీ మడతపెడితే, మాస్ మతిపోయింది. యూ ట్యూబ్ ఊగిపోయింది. ఇప్పుడు ఇదే పాట వరల్డ్ వైడ్ గా రీసౌండ్ చేసిన టాప్ సాంగ్స్ లిస్ట్ లోచేరంది. డిజిటల్ వోల్డ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2024 | 09:01 PMLast Updated on: Dec 30, 2024 | 9:01 PM

Mahesh Babu Song With Priyanka Chopra

సూపర్ స్టార్ మహేశ్ బాబు మొన్నామధ్య కుర్చీ మడతపెడితే, మాస్ మతిపోయింది. యూ ట్యూబ్ ఊగిపోయింది. ఇప్పుడు ఇదే పాట వరల్డ్ వైడ్ గా రీసౌండ్ చేసిన టాప్ సాంగ్స్ లిస్ట్ లోచేరంది. డిజిటల్ వోల్డ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కట్ చేస్తే మహేశ్ బాబు కుర్చీ మడత పెట్టే విధానానికి హాలీవుడ్ లేడీనే ఫిదా అయినట్టుంది. ఒక్కసారి సూపర్ స్టార్ తో కుర్చి మడత పెట్టేందుకు తను కూడా సిద్దమేఅంటోంది. ఆల్రెడీ కథ చర్చలు పూర్తయ్యాయి. రాజమౌళి మూవీలో తను అడుగుపెట్టడం లాంచనమే అంటున్నారు. తనే కాదు ఇండోనేషియా మూలాలున్న లేడీతో పాటు ఈ హాలీవుడ్ లేడీ కూడా, మహేశ్ బాబు జోడీగా ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ షురూ అంటున్నారు.. ఇంతకి ఆలేడీ దాడి ఎలా ఉండబోతోంది? రాజమౌళి కథకి ఏ హాలీవుడ్ లేడీ ఫిదా అయ్యింది?

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి సినిమా ఏప్రిల్ లో మొదలు కాబోతోంది. ముహుర్తాలు, ప్రి ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయి. ఇంతలో కుర్చీ మడత పెట్టి అంటూ మహేశ్ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. 526 మిలియన్లు అంటే 50 కోట్ల 26 లక్షల వ్యూస్ తో యూట్యూబ్ ని కుదిపేసింది ఈ సినిమాసాంగ్

తమన్న మ్యూజిక్ గుంటూరు కారానికి మ్యాజిక్ చేస్తే, ఈ పాట ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తూటాలా దూసుకెళ్లింది. యూకే, యూఎస్, కొరియా, ఇలా ప్రపంచ వ్యాప్తంగా భాష అర్ధం కాకున్నా ఈ పాటని చాలా మంది ఎంజాయ్ చేశారు. చాలా దేశాల్లో ఈ పాటకి అక్కడి దేశస్తులు చిందేశారు

ఐతే 2024 టాప్ టెన్ సాంగ్స్ లో ఈ పాట ఏకంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది. వరల్డ్ టాప్ సెవెన్ సాంగ్ గా కుర్చీ మడతపెట్టి సాంగ్ నిలిస్తే, ఇప్పుడు తనతో కుర్చీ మడతపెట్టేందుకు హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంకా చోప్రా రెడీ అయ్యింది

బేసిగ్గా తను మాజీ మిస్ వరల్డ్… అంతేకాదు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కూడా. కాని హాలీవుడ్ వెళ్లి అక్కడే సెటిలయ్యాక పాప్ సింగర్ నిక్ జోన్స్ ని పెళ్లిచేసుకుంది. ఇప్పటికీ హాలీవుడ్ వెబ్ సీరీస్ లు చేస్తోంది. అలాంటి తను మహేశ్ బాబు సినిమాకు ఆల్ మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాజమౌళి తీసే ఈ సినిమా ఏప్రిల్ సెకండ్ వీక్ సెట్స్ పైకెళ్లబోతోంది

ఇందులో ఇండోనేషియా మూలాలున్న అమెరికన్ నటి చెల్సియా నటించబోతోంది. ఐతే ప్రియాం చోప్రానే ఫీమేల్ లీడ్ అని ప్రచారం జరుగుతోంది. కథని ఆల్రెడీ రాజమౌళి టీం నెరేట్ చేసిందట. తను కూడా స్క్రిప్ట్ నచ్చింది కాని, తన పాత్ర విషయంలోనే కాస్త టైం కావాలందట. సో కొత్త ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తాలూకు టోటల్ కాస్ట్ అండ్ క్రూ తోపాటు టైటిల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా అది పాన్ వరల్డ్ మూవీలో అనగానే నార్త్ అమెరికా, యూరప్ లోకూడా ఈ మూవీకి రీచ్ బానే పెరిగుతుందనే మాటే వినిపిస్తోంది.