SSMB 29: వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్.. అన్నిటికి క్లారిటీ ఆరోజునే
పాన్ వరల్డ్ మూవీగా గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మూవీకి సంబధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rajamoulis movie in the same backdrop SSMB29
SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న SSMB 29పై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో.. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కూడా ఆసక్తికర అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా గ్రాండ్ లెవెల్లో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మూవీకి సంబధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన
ఈ మోస్ట్ అవైటింగ్ మూవీకి సంబంధించి త్వరలో మూవీ టీమ్ ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజే మూవీకి సంబంధించిన అన్ని విషయాలపై మూవీ టీమ్ క్లారిటీ ఇస్తుందని.. అప్పటి వరకు ఎటువంటి పుకార్లు నమ్మవద్దని వారి నుంచి న్యూస్ వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక.. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథని, కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. ఇక రాజమౌళి తీసిన గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఏకంగా గ్లోబల్ స్థాయిలో భారతీయ చలనచిత్రాన్ని నిలబెట్టాడు రాజమౌళి. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్‌తో రాజమౌళి తీయబోయే SSMB 29పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
ఆ అంచనాలకు తగ్గట్లుగానే మహేశ్‌తో తీసే ఈ సినిమాను జక్కన్న చాలా ఆచితూచి చెక్కే ప్లాన్‌లో ఉన్నాడట. మహేష్ బాబు పాత్రకు సంబంధించి మస్తు షేడ్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ బాబు పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుందని భోగట్టా. మహేష్ కెరీర్‌లో ఈ రోల్ స్పెషల్‌గా ఉండబోతుందని, ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోయేలా మహేష్ బాబు రోల్‌ను క్రియేట్ చేశారని సమాచారం అందుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.