Mahesh Babu: గుంటూరు కారం కొత్త షెడ్యూల్‌ ఫిక్స్‌.. త్రివిక్రమ్ కు మహేష్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

మహేష్‌ బాబు, త్రివిక్రం కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద ఫ్యాన్స్‌ ఎలాంటి హోప్స్‌ పెట్టుకున్నారో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ఖలేజా, అతడు సినిమాలు థియేటర్స్‌లో యావరేజ్‌గా నిలిచాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 12:42 PMLast Updated on: Jun 07, 2023 | 12:42 PM

Mahesh Babu Trivikram Combo Movie New Schedule

ఈ సినిమాల అద్భుతంగా ఉన్నా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం బ్లాక్‌బస్టర్‌ అనిపించుకలేకపోయాయి. దీంతో ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందా లేదా అనే టెన్షన్‌ ప్రతీ అభిమానిలో ఉంది. అయితే ఫ్యాన్స్‌ అంచనాలకు తగ్గట్టుగానే మహేష్‌ బాబును మాస్‌ లుక్‌లో చూపించబోతున్నాడు గురూజీ. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్‌, పోస్టర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పోకిరి సినిమా తరువాత మళ్లీ ఆ స్థాయిలో మహేష్‌ను మాస్‌ హీరోగా చూస్తున్నామంటున్నారు ఫ్యాన్స్‌.

మహేష్‌ బాబు ఫ్యామిలీ వెకేషన్‌తో ఆగిపోయిన ఈ షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ను ఫైనల్‌ చేశాడట త్రివిక్రం. ఈ నెల 12 నుంచి గుంటూరు కారం కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ కాబోతోదంటున్నారు. ఈ షెడ్యూల్‌లో మహేష్‌ బాబుతో పాటు సినిమా లోని కీలక పాత్రలపై షూటింగ్‌ ఉంటుందట. దీనికి సంబంధించి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది. ఫ్యాన్స్‌ కూడా అప్‌డేట్స్‌ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి లేట్‌ అప్‌డేట్స్‌ ఇవ్వడంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. స్వయంగా ప్రొడ్యూసర్‌ వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప ఈ రూమర్స్‌కు చెక్‌ పడలేదు. ఇప్పుడు కూడా అప్‌డేట్స్‌ లేట్‌ చేస్తే మళ్లీ అదే జరుగుతుందంటున్నారు ఫ్యాన్స్‌. కొత్త షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసి సినిమా నుంచి త్వరగా ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలని కోరుతున్నారు.