MAHESH BABU: మహేశ్ బాబు మీద ట్రోలింగ్..? కారణం ఎవరు..?
అన్నీంటికి మించి ఓ మై బేబీ సాంగ్‌లో తెలుగు పది శాతం, ఇంగ్లీష్ తొంబై శాతం ఉంది. ఎంత జనరేషన్ మారినా, ఎంత యూత్ అంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచే అయినా పాటలో మరీ అంత ఇంగ్లీషా అని విమర్శిస్తున్నారు.
MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏం పాపం చేశాడు..? తమన్ చేసిన తప్పునకు మహేశ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురౌతున్నాడు. అంతా గుంటూరు కారం మూవీలోని ఓ బేబీ సాంగ్ వల్ల వచ్చిన సమస్య ఇది. గుంటూరు కారం పాటలు తూటాల్లా పేలుతాయనుకుంటే పటాకాల్లా కూడా పేలట్లేదు. తమన్ ఆ రేంజ్‌లో ఊపులేని పాటలతో సరిపెడుతున్నాడు.
PRABHAS: సలార్ పాటలో షాకిస్తున్న ప్రభాస్ లుక్.. హెయిర్ స్టైల్‌పై కామెంట్స్
త్రివిక్రమ్ టేస్ట్ ఈసారి ఏమాత్రం ఆడియో లవర్స్‌ని ఆకట్టుకునేలా లేదనే మాటే వినిపిస్తోంది. అన్నీంటికి మించి ఓ మై బేబీ సాంగ్‌లో తెలుగు పది శాతం, ఇంగ్లీష్ తొంబై శాతం ఉంది. ఎంత జనరేషన్ మారినా, ఎంత యూత్ అంతా ఇంగ్లీష్ మీడియం బ్యాచే అయినా పాటలో మరీ అంత ఇంగ్లీషా అని విమర్శిస్తున్నారు. ఇదీ.. లిరిక్స్ మీద పేలుతున్న మీమ్స్ తాలూకు ట్రోలింగ్. ఇక ట్యూన్ ఏమైనా బాగుందా అంటే.. దీనికంటే ఆ మసాలా పాటే బెటర్. ఆ పాటనే ట్రోలింగ్ చేశారు.
అలాంటిది అందులో సగం రేంజ్‌ని కూడా అందుకునేలా లేదీ పాట. అందుకే పాటను, తమన్‌ని, త్రివిక్రమ్‌ని ట్రోల్ చేసి చేసి విసిగెత్తిన జనం.. కొత్తగా మహేశ్‌ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ఈ దర్శకుడు, ఆ మ్యూజిషియన్‌ని ఎంచుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.