Mahesh Babu: మహేశ్ తలరాత మార్చేంత లేదు.. మారితే వాళ్ల తలరాతే..
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా హిట్టైతే కొన్ని లెక్కలు మారే ఛాన్స్ ఉంది. ఈ విషయంలో మహేశ్ బాబుకి కొత్తగా ఒరిగబోయేది ఏముండదు.. దానికి కారణముంది.

Mahesh and Trivikram Movie
బేసిగ్గానే మహేశ్ బాబుకి సౌత్ లో పాటు నార్త్ లో కూడా గుర్తింపు ఉంది.సో త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ చేసే ఫస్ట్ పాన్ ఇండియా మూవీతో తనకు కొత్తగా ఒరిగేదేంలేదు.. ఇది కాకపోయినా రాజమౌళి మూవీ ఉంది కాబట్టి.. ఈ మూవీ తో ఎవరైనా లాభపడతారంటే ఇన్ స్టంట్ గా లాభపడేది మాత్రం త్రివిక్రమే. ఎందుకంటే ఒకేసారి పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు, అలానే పాన్ ఇండియా మార్కెట్ కూడా క్రియేట్ అవుతుంది.. ఈ మూవీ గట్టెక్కితే రాజమౌళి, సుకుమార్, తర్వాత త్రివిక్రమ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది
ఇక అమరావతికి అటు ఇటు, లేదంటే గుంటూరు కారం, లేదంటే మరో పేరు, టైటిల్ ఏదైనా ఈ సినిమా హిట్టైతే, అందరికంటే అద్రుష్టమంతురాలు పూజా హెగ్డేనే. ఎందుకంటే 5 వరుస ఫ్లాపులతో డీలా పడింది. అలాంటి తనకి తెలుగులో కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో ఒకే సారి హిట్ వస్తే పండగనే.. మరీ ఈ పాన్ ఇండియా మూవీ హిట్టైతే, తన గత వైభవం, మార్కెట్ మళ్లీ వస్తాయి.. ఆఫర్లు క్యూ కడతాయి.. సో మహేశ్ మూవీతో మహేశ్ కంటే మిగతావాళ్లకే ఎక్కువ లాభంగా మారబోతోంది.