MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు అడవుల్లోకి వెళ్లింది అందుకే..
ఈ సినిమాకోసం హాలీవుడ్ మూవీలకు పనిచేసే ఇద్దరు యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నాడట రాజమౌళి. ఆ టీంలో మెంబరే మహేశ్‌కి జర్మనీ అడవుల్లో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ట్రెక్కింగ్, ఐస్ స్లైడింగ్.. ఇలా చాలా నేర్పిస్తున్నాడని తెలుస్తోంది.
MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు జర్మనీలో కేవలం వర్కవుట్లు చేసి కండలు పెంచేందుకే కాదు, అక్కడి అడవుల్లో పరుగులు తీయటం, కొండలు ఎక్కడం లాంటి చాలా పనులు నేర్చుకుంటున్నాడు. ఈ సినిమాకోసం హాలీవుడ్ మూవీలకు పనిచేసే ఇద్దరు యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నాడట రాజమౌళి. ఆ టీంలో మెంబరే మహేశ్‌కి జర్మనీ అడవుల్లో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ట్రెక్కింగ్, ఐస్ స్లైడింగ్.. ఇలా చాలా నేర్పిస్తున్నాడని తెలుస్తోంది.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ పెళ్లి వేదిక మార్పు.. మోదీనే కారణమా..?
ఇక ఈ సినిమాకు తెలుగు నిర్మాత కేఎల్ నారాయణ రూ.400 కోట్లు పెట్టుబడి పెడితే, డ్రీమ్ వర్క్స్ బ్యానర్ రూ.1100 కోట్లు బడ్జెట్ పెట్టుబడి పెట్టి, రంగంలోకి దిగబోతోందట. అంతేకాదు ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో సాహసాలను చూపించాలనుకున్నా, ఎక్కువగా యూరప్ లొకేషన్లలోనే షూటింగ్ ఉంటుందట. అది అలవాటు అవ్వటానికే మహేశ్‌ని అక్కడికి పంపించాడట రాజమౌళి. అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌లో 70శాతం వరకు కేవలం రెండు షెడ్యూల్స్‌లోనే పూర్తిచేసేలా ప్లాన్ చేశారు.
ఆ డెబ్బై శాతం షూటింగ్ ముందే పూర్తి చేయటానికి కారణం, గ్రాఫిక్స్ అవసరమైన సీన్లు ముందు తీసి, తర్వాత టాకీ పార్ట్ తెరకెక్కించాలనుకుంటున్నాడట రాజమౌళి. బాహుబలి నుంచి ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడు జక్కన్న.