డైనోసార్ తో మహేశ్ బాబు.. యుద్ద ట్యాంక్ తో ఎన్టీఆర్..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న సినిమాలొ డైనోసార్ గెస్ట్ రోల్ వేస్తే ఎలా ఉంటుంది.. నిజంగా ఇది జరగబోతోంది. ఇందులో డైనోసార్ల తో మహేశ్ బాబు ఫైట్ చేసే సీన్ ఉండబోతోందన్న వార్త రాగానే, ఇండియన్ ఇండస్ట్రీ జనాలంతా షాకవుతున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న సినిమాలొ డైనోసార్ గెస్ట్ రోల్ వేస్తే ఎలా ఉంటుంది.. నిజంగా ఇది జరగబోతోంది. ఇందులో డైనోసార్ల తో మహేశ్ బాబు ఫైట్ చేసే సీన్ ఉండబోతోందన్న వార్త రాగానే, ఇండియన్ ఇండస్ట్రీ జనాలంతా షాకవుతున్నారు. ఇప్పటి వరకు బాహుబలిలో దున్నపోతుతో ఫైట్ చూశాం… జోదా అక్బర్ లో ఏనుగు, ముసలితో హీరో ఫైట్ చేయటం చూశాం.. కాని ఫస్ట్ టైం ఇండియన్ సినీమా స్క్రీన్ మీద ఇండియన్ డైనోసార్ తో ఇండియన్ ఫైట్ చేయటం చూడబోతున్నాం… ఇదే విచిత్రం అనుకుంటే, యుద్ధ ట్యాంక్ తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫైట్ సీన్ నెక్ట్స్ లెవల్ అనితెలుస్తోంది. ఒక సెట్లో మహేశ్ బాబు డైనోసార్లతో ఫైట్ చేయబోతుంటే, మంగుళూరు సెట్ లో యుద్ధట్యాంక్ తో ఎన్టీఆర్ ఫైట్ చేయటం కన్ఫామ్ అయ్యింది. విచిత్రం ఏంటంటే రెండు హాలీవుడ్ మూవీలు కలిపితే మహేవ్ బాబు 29 వ సినిమా అన్న మాట, ఇప్పుడిప్పుడే నిజమయ్యేలా ఉంది. ఇంతకి ఇందులో ఇంకెన్ని వింతలుండబోతున్నాయి..? ఏవేవి లీకుల రూపంలో షాకులిస్తున్నాయి…? హావేలుక్
ఇండియన్ స్క్రీన్ మీద డైనోసార్లు కనిపిస్తే, అది నిజంగా పెద్ద వింతే… ఒకప్పడు శంకర్ తన జీన్స్ మూవీలో డైనోసార్ బొమ్మల్లి చూపించాడు. అది కూడా రెడీ మేడ్… కాని రాజమౌళి ఇప్పడు జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ లాంటి హాలీవుడ్ మూవీల్లోనే కనిపించే ఈ డైనోసారి పాత్రని మహేశ్ బాబు మూవీలో తీసుకున్నాడని తెలుస్తోంది.ఈ రాక్షస బల్లులు మానవ జాతి పుట్టకముందే పుట్టిన భయంంకరమైన జీవి జాతి. అలాంటి వాటిని మనుషులకు లింక్ చేస్తూ జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ ఇలా చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి పాత్రలు, సీన్లు, సినిమాలు హాలీవుడ్ లోనే కనిపించాయి, కాని మరెక్కడా ఆ స్థాయి గ్రాఫిక్స్, ఆరేంజ్ మూవీలు రాలేదు. జపాన్ లో ఏదో ఫిక్షన్ పాత్రైన గాడ్జిల్లా లాంటి సినిమాలొచ్చాయి.
చైనా నుంచి డ్రాగన్ మీద గ్రాఫికల్ ఎటాక్ తో ప్రయోగాలు కనిపించాయి. కాని ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో డైనోసార్ ని తెర మీద చూపించే సాహసం ఎవరూ చేయలేదు. అదే ఇప్పుడు రాజమౌళి చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తను తీస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ29 లో హీరో ఏకంగా డైనోసార్లతో ఫైట్ చేసే సీన్లు ఉన్నాయట.అది కూడా ఒకటి కాదు, ఏకంగా నాలుగు సార్లు డైనోసార్లతో హీర పోరాడాల్సి వస్తుందట… హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్, అలానే జురాసిక్ వరల్డ్ సినిమాలకు కలిపితే అదే సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ అనుకోవాల్సి వచ్చేలా ఉంది. 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీ మాత్రమే కాదు, ఫస్ట్ టైం ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమా కూడా ఇదే. ఏడు ఖండాలు, ఏడు వింతల దగ్గర షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌలికి ఇన్ని వింతలు సరిపోయినట్టు లేవు..
ఇప్పుడు సీన్ లోకి డైనోసార్లను కూడా తీసుకొస్తున్నాడు. హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ లో డైనోసార్ పిల్లలతో మనిషి ఫైట్ చేసే సీన్ ఉంటుంది. మరి ఆ సీన్ ప్రేరణతో ఎస్ ఎస్ ఎమ్ బీ29లో డైనోసార్ ఫైట్ పెట్టాడేమో కాని, ఇందులో హీరో పాత్ర మాత్రం హనుమంతుడి ప్రేరణతో ప్లాన్ చేశాడట రాజమౌలి. అంతేకాదు ఘటోత్కజుడి కొడుకు బార్బారికుడి పాత్ర, హనుమంతుడిని కలిపితే హీరో రోల్ అని కూడా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.ఏదేమైనా డైనోసార్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫైటే షాకింగ్ అనుకుంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏకంగా యుద్దట్యాంక్ తో ఫైట్ చేసే సీన్ అంతకంటే షాకింగ్… ప్రజెంట్ మంగులూరులో హంట్ స్టార్ట్ అని ట్వీట్ చేశాడు ప్రశాంత్ నీల్. మంగుళూరు కోటలో వేసిన సెట్లో యుద్దట్యాంకర్ తో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ఎలా ప్లాన్ చేశాడో కాని, ఈరెండు ఫైట్ సీన్లతోనే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా కనిపిస్తోంది.