Mahesh Babu: సితార పాప.. సూపర్.. నాన్నను మించిన మంచితనం..
మహేష్ ముద్దుల కూతురు సితార కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహను ప్రదర్శిస్తోంది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రాన్ని అనాథ బాలలకు సితార ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఏఎంబీ సినిమాస్‌లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది.

Mahesh Babu: మహేష్ బాబు.. సినిమాలతోనే కాదు సోషల్ సర్వీసులతోనూ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. కష్టం ఉంది అన్నా అంటే చాలు.. తోచిన సాయం చేసి, అవతలివారి నవ్వులో ఆనందం వెతుక్కునే మనిషి అంటారు మహేష్ బాబును దగ్గరి నుంచి చూసినవాళ్లు! వందల మంది పైగా చిన్నారులకు సొంత ఖర్చులతో గుండె ఆపరేషన్లు చేయించి కూడా బయటకు చెప్పుకోకుండా.. తనకు తోచిన సాయం చేసుకుంటూ వెళ్లే మహేష్ బాబును అభిమానించకుండా ఎలా ఉండగలం అన్నది ఆయన ఫ్యాన్స్ ఎప్పుడూ చెప్పే మాట.
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడు..? సినిమా వాయిదా పడుతుందా..?
ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో వందలాది చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు చేయించి తన పెద్ద మనసు చాటుకున్నారు. రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. మహేష్ ముద్దుల కూతురు సితార (Sitara Ghattamaneni) కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహను ప్రదర్శిస్తోంది. మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రాన్ని అనాథ బాలలకు సితార ప్రత్యేకంగా ప్రదర్శించింది. హైదరాబాద్‌లోని తమ సొంత థియేటర్.. ఏఎంబీ సినిమాస్‌లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. మహేశ్ బాబు ఫౌండేషన్, చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ శరణాలయం పిల్లలతో కలిసి.. సితార గుంటూరు కారం సినిమా చూసింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అనాథ పిల్లలతో కలిసి హాయిగా నవ్వుతున్న సితార ఫొటోలను.. మహేష్ అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.
నువ్ సూపర్ పాప.. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నావ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక అటు డివైడ్ టాక్ వచ్చినా.. గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ నెమ్మెదిగా పికప్ అవుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గుంటూరు కారం మూవీ ఇప్పటివరకు 220కోట్ల వరకు కలెక్ట్ చేసిందని నిర్మాతలు ప్రకటించారు. సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయిన ఈ మూవీ.. త్వరలో అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయ్.