GUNTUR KAARAM: త్రిబుల్ ఆర్, సలార్, రాధేశ్యామ్ తర్వాతే గుంటూరు కారం..?

నైజాంలో రూ.40 కోట్లు, సీడెడ్‌లో రూ.15 కోట్లు, ఆంధ్రాలో 48 కోట్లకు గుంటూరు కారం థియేట్రికల్ రైట్స్ సేల్ అయితే, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్ సీస్ కలుపుకొని రూ.30 కోట్లు వచ్చేశాయి. కేవలం థియేట్రికల్‌గా ప్రీరిలీజ్ బిజినెస్సే రూ.135 కోట్లు వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2024 | 06:44 PMLast Updated on: Jan 11, 2024 | 6:44 PM

Mahesh Babus Guntur Kaaram Movie Not Crossed Prabhas Records

GUNTUR KAARAM: గుంటూరు కారం మూవీ ప్రివ్యూ యూఎస్‌లో ఏకంగా 1792 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్‌గా శుక్రవారం మాత్రం 4 వేల థియేటర్స్‌లో రిలీజ్ అన్నారు. ప్రి రిలీజ్ బిజినెస్ మతిపోగొడుతోంది. నైజాంలో రూ.40 కోట్లు, సీడెడ్‌లో రూ.15 కోట్లు, ఆంధ్రాలో 48 కోట్లకు గుంటూరు కారం థియేట్రికల్ రైట్స్ సేల్ అయితే, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్ సీస్ కలుపుకొని రూ.30 కోట్లు వచ్చేశాయి. కేవలం థియేట్రికల్‌గా ప్రీరిలీజ్ బిజినెస్సే రూ.135 కోట్లు వచ్చాయి.

GUNTUR KAARAM: మహేశ్ మూవీ మీద ఫైర్ అవుతున్న ప్రభాస్, పవన్ ఫ్యాన్స్

అంటే మొత్తం పెట్టుబడి అయిన 170 కోట్లలో రూ.150 కోట్లు వచ్చినట్టే. ఇక 20 కోట్లు అదనం. అంతేకాదు డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూ.100 కోట్లపైనే. అంటే కనీసం 120 కోట్లు రిలీజ్ కిముందే ఫిల్మ్ టీం అందుకుంది. కాని ఒక విషయంలో గుంటూరు కారం వెనకబడింది. ప్రభాస్ కంటే మహేశ్ రెండు సార్లు వెనకడుగు వేయాల్సి వచ్చింది. అదే యూఎస్ ప్రివ్యూల విషయంలో అని తేలింది. యూఎస్‌లో గుంటూరు కారం ప్రివ్యూలని 1792 స్క్రీన్స్‌లో వేశారు. కాని ఈ విషయంలో మూడు సినిమాలు గుంటూరు కారం మూవీని మించాయి.

అవే త్రిబుల్ ఆర్, సలార్, రాధేశ్యామ్. త్రిబుల్ఆర్ మూవీ యూఎస్‌లో 5408 స్క్రీన్స్‌లో ప్రివ్యూగా వేస్తే, సలార్ 2415 స్క్రీన్స్‌లో ప్రివ్యూ వేశారు. సలార్ 2110 స్క్రీన్స్‌లో ప్రివ్యూ వేశారు. వీటితో పోలిస్తే 1792 స్క్రీన్స్‌లో ప్రివ్యూ పడటం వల్ల ఈ సినిమా నాలుగో స్థానం దక్కించుకుంది.