GUNTUR KAARAM: గుంటూరు కారం.. 5 మిలియన్లే టార్గెట్
అక్కడ ఇంతవరకు తన సినిమాలేవి కూడా 3.5 మిలియన్లను మించి వసూళ్లు రాబట్టలేదు. అందుకే ఎట్టిపరిస్థితుల్లో గుంటూరు కారం కనీసం 5 మిలియన్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడట మహేశ్.
GUNTUR KAARAM: సూపర్ స్టార్ మహేశ్ బాబు టార్గెట్ 40 కోట్లంటున్నాడు. ఎలాగైనా సరే ఆ రేంజ్ వసూళ్లు రీచ్ అవ్వాలంటున్నాడు. తన మూవీ ఓపెనింగ్సే రూ.60 కోట్లు దాటే సీన్ ఉంది. మొత్తంగా కనీసం తనకి రూ.250 కోట్ల మార్కెట్ ఉంది. తన రెమ్యునరేషనే దాదాపు వందకోట్లకు చేరింది. అలాంటిది తను మాత్రం టార్గెట్ 40 కోట్లు అంటున్నాడు. దానికి కారణం యూఎస్ మార్కెట్.. అక్కడ ఇంతవరకు తన సినిమాలేవి కూడా 3.5 మిలియన్లను మించి వసూళ్లు రాబట్టలేదు.
PRABHAS: ఆ సినిమాలతో ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడా..? పంచ్ పడుతుందా..?
అందుకే ఎట్టిపరిస్థితుల్లో గుంటూరు కారం కనీసం 5 మిలియన్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడట మహేశ్. ఇదే టార్గెట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా పెట్టుకున్నాడు. తన.. అల వైకుంఠపురంలో మూవీ యూఎస్ వసూళ్లు 3.6 మిలియన్లు. అంటే రూ.25 కోట్లకు మించి అక్కడ వసూళ్లు రాలేదు. అదే 5 మిలియన్లు చొప్పున ఈ సారి వసూళ్లు వస్తే నెక్ట్స్ లెవల్‌కి వెళ్లినట్టవుతుంది. యూఎస్ వసూళ్లలో హీరోకి కాని, దర్శకుడికి కాని 60శాతం వాటా ఉంటుంది. అది కూడా ఒక రీజన్ కావొచ్చు. అలానే తమిళ్ మూవీలు ఈజీగా 5 మిలియన్లు రాబడుతున్నాయి. హిందీ సినిమా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ లాంటి చిన్న ప్రాజెక్ట్ పదిన్నర మిలియన్లు రాబట్టింది.
ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి మేకింగ్‌లో మూవీ చేయబోయే మహేశ్.. ఆ సినిమా కంటే ముందే కనీసం యూఎస్‌లో 5 మిలియన్ల మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోతే ప్రోగ్రెస్ పడిపోతుంది. రాజమౌళి మార్కెట్ మీదే తను ఆధారపడాల్సి వస్తుంది. ఇదీ.. గుంటూరు కారం యూఎస్ వసూళ్ల టార్గెట్ వెనకున్న రీజన్.