Guntur Kaaram: గుంటూరుకారం షూటింగ్‌కి వంద గండాలు.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా..?

గుటూరుకారం షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. గుంటూరుకారం రిలీజైతేగానీ రాజమౌళి సినిమా మొదలు కాదు. రెండు నెలలుగా షూటింగ్‌కు నోచుకోకపోయినా జనవరి 12నే రిలీజ్‌ అంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారేగానీ సినిమా మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడొస్తుందో చెప్పలేకపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 04:40 PMLast Updated on: Aug 16, 2023 | 4:40 PM

Mahesh Babus Guntur Kaaram Troubles Continues Now This The Story

Guntur Kaaram: కూతురు సితార బర్త్‌డే, తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ఫారిన్‌లో చేసుకుని ఇండియా వచ్చేశాడు సూపర్ స్టార్ మహేశ్‌. హీరో ఇండియా వచ్చే డేట్‌ తెలిసినా గుంటూరుకారంకు ముహూర్తం పెట్టలేదు. ఒక్కొక్కరూ సినిమా నుంచి వెళ్లిపోతూనే వున్నారు. లేటెస్ట్‌గా మరో వికెట్ పడింది. మహేశ్‌ ఇండియా తిరిగొచ్చినా ఖాళీగానే కూర్చోవాల్సిన పరిస్థితి. చేతిలో గుంటూరుకారం.. రాజమౌళి సినిమావున్నా దేనిలోనూ నటించడంలేదు.

గుటూరుకారం షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. గుంటూరుకారం రిలీజైతేగానీ రాజమౌళి సినిమా మొదలు కాదు. రెండు నెలలుగా షూటింగ్‌కు నోచుకోకపోయినా జనవరి 12నే రిలీజ్‌ అంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారేగానీ సినిమా మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడొస్తుందో చెప్పలేకపోతున్నారు. గుంటూరుకారం ఆలస్యమయ్యే కొద్దీ ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ముందుగా పూజా హెగ్గే శ్రీకారం చుట్టగా.. ఆమె ప్లేస్‌ను శ్రీలీల భర్తీ చేసింది. శ్రీలీల ప్రస్తుతం 10 సినిమాలతో బిజీగా వుంది. షూటింగ్‌ స్టార్ట్‌ చేసినా ఈ అమ్మడి డేట్స్ దొరకడం కష్టమే. ఒకవేళ గుంటూరు కారం సినిమాకు డేట్స్‌ ఇవ్వాలంటే మరో మూవీ డేట్స్ ఎడ్జెస్ట్ చేయాల్సిందేనట.
అల వైకుంఠపురంలో వంటి బ్లాక్‌బస్టర్‌ తీసిన త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి డైరెక్టర్‌. సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరో. క్రేజీ కాంబినేషన్ అయినా షూటింగ్‌ ఆలస్యమయ్యే కొద్దీ ఆ క్రేజ్‌ కాస్తా ఆవిరైపోతోంది. నెలలు గడుస్తున్నా గుంటూరుకారం మొదలుకాకపోవడంతో కెరీర్‌ గ్యాప్‌లో పడిపోతుందన్న ఫీలింగ్‌లో నటీనటులు టెక్నీషియన్స్‌ వున్నారు.

టాలీవుడ్‌ టాప్‌ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్ కూడా గుంటూరుకారం నుంచి బైటకొచ్చేశారు. శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, సరిలేరు మీకెవ్వరు వంటి ఎన్నో హిట్స్‌కు ఫైట్స్‌ ఇచ్చిన రామ్‌లక్ష్మణ్‌ త్రివిక్రమ్‌తో మంచి అనుబంధం వున్నా డేట్స్‌ ఎడ్జెస్ట్ చేయలేకపోయారట. ఫుల్‌ బిజీగా వుండే ఈ ఫైట్ మాస్టర్స్‌ గుంటూరుకారం కోసం ఇంతకాలం వెయిట్‌ చేసినా ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారో తెలీని కన్‌ఫ్యూజన్‌లో బైటకొచ్చేశారు. మహేశ్‌ బర్త్‌డే సందర్భంగా రెండు స్టిల్స్‌తో సరిపెట్టినా.. జనవరి 12నే రిలీజ్‌ అంటూ ఉత్సాహం నింపారు. అయితే.. షూటింగ్‌ మాత్రం మొదలుకాకపోవడంతో.. నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేయగలరా..? అన్న అనుమానం అయితే ఫ్యాన్స్‌ను వీడలేదు.