GUNTUR KARAM: గుంటూరు కారంలో సర్‌ప్రైజ్.. మహేశ్‌తో కలిసి కనిపించనున్న మరో స్టార్

ఈ మూవీ హైదరాబాద్‌లో ఏకంగా 90 స్క్రీన్స్‌లో ఆడేలా దిల్ రాజు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హానుమాన్ మూవీకి ఇక హైదరాబాద్‌లో స్క్రీన్లు దొరికే అవకాశం లేకుండా.. మొత్తం హైదరాబాద్ థియేటర్స్‌ని గుంటూరు కారమే ఆక్రమించబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2024 | 07:26 PMLast Updated on: Jan 03, 2024 | 7:26 PM

Mahesh Babus Guntur Karam Movie Has A Surprise

GUNTUR KARAM: గుంటూరు కారం పాటలో మహేశ్ బాబు వేసిన స్టెప్పులే వైరలయ్యాయి. పాటలో బూతు మాట మీద ఎంత ట్రోలింగ్ జరిగినా, వాటన్నీంటికి మహేశ్ మాస్ స్టెప్పులే సమాధానంగా మారాయి. అవన్నీ పక్కకి వెళ్లేలా మహేశ్ డాన్స్ డైవర్ట్ చేసింది. ఇక ఇందులో ఇదే సర్‌ప్రైజ్ అంటే అంతకుమించే షాకులు, కిక్కిచ్చే అంశాలున్నాయన్నాడు నిర్మాత నాగవంశీ. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ పాటని వాడబోతున్నారట.

Shine Tom Chacko: మళ్లీ పెళ్లి.. త్వరలో దసరా విలన్ పెళ్లి

యమలీలలోని పాటని, అలాగే ఆకాశంలో ఒకతార పాటని కూడా ఇందులో ఓ సీన్‌లో వాడారట. ఆ పాటలో కృష్ణతో కలిసి మహేశ్ చిందేసేలా గ్రాఫిక్స్‌లో మ్యాజిక్ చేయబోతున్నారట. దీంతో ఒకే టిక్కెట్‌కి రెండు సూపర్ స్టార్ల సినిమాలు చూసినట్టౌతుందని అంటున్నాడు నిర్మాత నాగ వంశీ. ఇక ఈ మూవీ హైదరాబాద్‌లో ఏకంగా 90 స్క్రీన్స్‌లో ఆడేలా దిల్ రాజు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. హానుమాన్ మూవీకి ఇక హైదరాబాద్‌లో స్క్రీన్లు దొరికే అవకాశం లేకుండా.. మొత్తం హైదరాబాద్ థియేటర్స్‌ని గుంటూరు కారమే ఆక్రమించబోతోంది.

అంతేకాదు తెలంగాణలో ఈ సినిమాకు 6 షోలకి పర్మిషన్ దొరికినట్టు తెలుస్తోంది. అది కూడా ఏకంగా 10 రోజులు పర్మిషన్ ఇచ్చారట. ఇవన్నీ చూస్తుంటే సంక్రాంతికి గుంటూరు కారం సునామీ క్రియేట్ చేసేలా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.