కృష్ణ మరణం వెనక మహేష్ బాబు హస్తం.. వేణు స్వామి అడ్రస్ కావాలంటున్న ఫ్యాన్స్..!

ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరికే ఉండరు కదా చూసేవాళ్లు. టైమ్ బాగున్నపుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 12:15 PMLast Updated on: Apr 04, 2025 | 12:15 PM

Mahesh Babus Hand Behind Krishnas Death Fans Want Venu Swamys Address

ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరికే ఉండరు కదా చూసేవాళ్లు. టైమ్ బాగున్నపుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది.. ఏదో ఒక్కరోజు ఆ టైమ్ హ్యాండిస్తుంది చూడు అప్పుడుంటుందిరా నీకు అంటుంటారు కదా..? ఇప్పుడు వేణు స్వామిని చూసి ఇదే అంటున్నారు చాలా మంది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ ఇప్పుడు.. కానీ ఓరోజు నీ సీన్ సితార అవుతుంది చూడు అప్పుడుంటుంది నీకు.. ఆ రోజు నీకు సాయం చేసేవాళ్లు కూడా ఉండరు.. ఈ రోజు నువ్వు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్ కదా.. నువ్వు దొరికిన రోజు కుళ్లబొడవడం ఖాయం అంటున్నారు నెటిజన్లు. అంతగా ఏం చేసాడబ్బా ఈయన అనుకోవచ్చు.. అసలు వేణు స్వామి ఏం చేయకపోతే ఆశ్చర్యపోవాలి.. చేసినపుడు కాదు. తాజాగా ఈయన చేసిన కామెంట్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మామూలుగా కాలట్లేదు. అడ్రస్ ఇవ్వండి ముందు.. వెళ్లి అంతు చూస్తామంటున్నారు వాళ్లు. స్టార్ హీరోలపై కామెంట్స్ చేస్తే తాను కూడా స్టార్ అయిపోతానేమో అనే భ్రమ నుంచి ఇంకా బయటికి రావట్లేదు వేణు.

ఆ మధ్య శోభిత, చైతూ గురించి చెప్పి.. పోలీసుల వరకు వ్యవహారం వెళ్లిన తర్వాత సారీ చెప్పాడీయన. మళ్లీ జాతకాలు చెప్పనంటూ ఉత్తుత్తి కబుర్లు బాగానే చెప్పాడు. కానీ అలవాటు పడిన ప్రాణం కదా అంత ఊరికే ఎందుకుంటుంది చెప్పండి..? అందుకే జాతకాలు చెప్పడానికి మళ్లీ బయల్దేరిపోయాడు. మొన్నటికి మొన్న ప్రభాస్ ఆరోగ్యం చెడిపోయింది.. విజయ్ దేవరకొండ, సమంతలలో ఒకరు సూసైడ్ చేసుకుంటారంటూ పిచ్చి పిచ్చి మాటలు చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడేమో ఏకంగా మహేష్ బాబుపైనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానికి కారణం మహేష్ బాబు అంటూ నోటికొచ్చినట్లు వాగేసాడు. దానికి మళ్లీ ఓ బ్యాక్ స్టోరీ కూడా చెప్తున్నాడీయన. తాను 1995 సంవత్సరం నుంచి కృష్ణ గారి ఇంట్లో పూజలు చేస్తున్నానని.. అలాంటి తనను వాళ్ల ఇంట్లో పూజలకు పిలువడం మానేశారని చెప్పుకొచ్చాడీయన. ఎందుకంటే.. జాతక రీత్యా ఏది ఉన్నా కూడా మొహమాటం లేకుండా చెప్పడం తనకు అలవాటని.. అలా చెప్పడంతోనే వాళ్లు తనను దూరం పెట్టారన్నాడు వేణు స్వామి.

విజయ నిర్మల ఇంట్లో పూజలు చేయడానికి వెళ్ళినపుడు.. జాతకం ఎలా ఉందని ఆమె తనను అడిగారని.. తాను ఉన్నదున్నట్లు చెప్పడంతో ఆమెకు కోపం వచ్చిందన్నాడు వేణు స్వామి. తాను నిజం చెప్పేందుకు ప్రయత్నించానని.. ఈ క్రమంలోనే 2020 నుంచి వరసగా మీ ఇంట్లో మరణాలు ఉంటాయని చెప్పినట్లు గుర్తు చేసాడు వేణు. దాంతో వాళ్లు షాక్ తిన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు వేణు స్వామి. తాను చెప్పినట్లుగానే 2020 తర్వాత మరణాలు ఉన్నాయని గుర్తు చేసాడు. వెంటనే నరేష్ వచ్చి మీరు ఎందుకు అలా చెప్పారు.. అమ్మ గురించి తెలుసుగా.. అమ్మ ఆరోగ్యం గురించి తెలిసి కూడా ఎందుకు చెప్పారు.. ఇప్పుడు ఆమె భయాందోళనలకు గురి అవుతారనన్నాడు వేణు స్వామి. వాళ్లింట్లో సంభవించే మరణాల గురించి చెప్పడం వల్లే వాళ్ల ఇంట్లో పూజలకు పిలవడం మానేశారన్నాడు ఈ అయ్యగారు.

అంతేకాదు.. మహేశ్ బాబు గ్రహ రాశి సింహరాశి.. తాను జాతకం చెప్పిన సమయంలో మహేశ్ జాతకంలో శని గ్రహం మారుతుందని.. దాని ప్రభావమే తల్లిదండ్రులపై పడిందన్నాడు వేణు. జనవరి 16 తర్వాత వాళ్లింట్లో తల్లిదండ్రులకు ఏదో ఒక చెడు జరుగుతుందని తాను ముందుగానే గ్రహించానని.. అనుకున్నట్లుగానే మహేష్ గ్రహ స్థితి వల్లే కృష్ణ గారు చనిపోయారని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. సినిమా వాళ్లు, ప్రముఖులపై ఇలా పిచ్చి పిచ్చి జాతకాలు చెప్తే.. నీ జాతకం ఏదో ఒకరోజు మేం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.