మహేష్ బాబు కొత్త లుక్.. ఈసారి లీక్ కాదు.. ఇట్స్ అఫీషియల్..! పండగ చేసుకోండి..!
రాజమౌళితో సినిమా చేస్తున్నా.. పాత అలవాట్లు మాత్రం మర్చిపోలేకపోతున్నాడు మహేష్ బాబు. గతంలో ఏ దర్శకుడితో సినిమా చేసినా కూడా యాడ్స్ కూడా కంటిన్యూగా చేసే అలవాటు మహేష్ కు ఉంది.

రాజమౌళితో సినిమా చేస్తున్నా.. పాత అలవాట్లు మాత్రం మర్చిపోలేకపోతున్నాడు మహేష్ బాబు. గతంలో ఏ దర్శకుడితో సినిమా చేసినా కూడా యాడ్స్ కూడా కంటిన్యూగా చేసే అలవాటు మహేష్ కు ఉంది. అయితే ఒక్కసారి రాజమౌళి సినిమాకు కమిట్ అయిన తర్వాత ఆ పాత పద్ధతులకు గుడ్ బై చెప్పాల్సిందే. మహేష్ బాబు కూడా ఇదే చేశాడు. ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ మీదకు వచ్చిన తర్వాత పూర్తిగా జక్కన్న ఆధీనంలోకి వెళ్లిపోయాడు సూపర్ స్టార్. కానీ ఈయన గతంలో చేసిన యాడ్స్ ఉంటాయి కదా వాటిని ఇప్పుడు విడుదల చేస్తున్నారు. తాజాగా కూతురు సితారతో కలిసి ఒక యాడ్ చేశాడు మహేష్. ఎప్పుడో షూట్ పూర్తి చేసుకున్న ఈ కమర్షియల్ ఇప్పుడు విడుదలైంది. కాకపోతే రాజమౌళి సినిమాకు ఎలాంటి లుక్ లో అయితే కనిపిస్తున్నాడో ఇందులో కూడా అదే లుక్ మైంటైన్ చేశాడు మహేష్. దాంతో SSMB 29 లుక్ అధికారికంగా విడుదలైనట్టే. తాజాగా ఒరిస్సా షెడ్యూల్ పూర్తిచేసుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు జక్కన్న అండ్ టీం. అందులో బయటకు వచ్చిన ఫోటోలు చూస్తుంటే మహేష్ సేమ్ టు సేమ్ లుక్ లో కనిపిస్తున్నాడు.
తాజాగా చేసిన యాడ్ లో కూడా అదే లుక్కు కనిపించడంతో.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సినిమా గురించి రాజమౌళి అప్డేట్ ఇవ్వకపోయినా కూడా యాడ్ చేసి తమ హీరో లుక్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చాడు అంటూ పండగ చేసుకుంటున్నారు మహేష్ బాబు అభిమానులు. ఇది ఒక క్లోత్ యాడ్. ఇందులో మహేష్ తో పోటీపడి నటించింది సితార. ఇప్పటికే కొన్ని కమర్షియల్స్ లో నటించి కోట్ల పారితోషికం అందుకుంటుంది సితార. తనకు వచ్చిన డబ్బులను స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలకు ఇస్తుంది మహేష్ బాబు తనయ. మరోవైపు సూపర్ స్టార్ కూడా యాడ్స్ నుంచి సంవత్సరానికి దాదాపు 30 నుంచి 40 కోట్లకు మధ్యలో సంపాదిస్తున్నాడు. ఇందులో చాలావరకు చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్ కోసం ఇస్తున్నాడు మహేష్. మహేష్ ఖాతాలో ప్రస్తుతం 10కి పైగానే బ్రాండ్స్ ఉన్నాయి. వాటన్నింటికీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు సూపర్ స్టార్.
అయితే రాజమౌళి సినిమాకు కమిట్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎలాంటి కమర్షియల్ యాడ్స్ చేయను అని ముందుగానే ఆయా కంపెనీలకు చెప్పేశాడు మహేష్. ఒకసారి జక్కన్న సినిమా పూర్తి అయ్యిందంటే ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది. అప్పుడు తమ బ్రాండ్స్ కు ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది అని బలంగా నమ్ముతున్నారు ఆయా కంపెనీలు. రాజమౌళి సినిమా మొదలుపెట్టే ఆరు నెలల ముందు నుంచే తను ఒప్పుకున్న యాడ్స్ షూటింగ్స్ అన్ని పూర్తి చేస్తూ వచ్చాడు మహేష్. వాటికి సంబంధించినవే విడుదలవుతున్నాయిప్పుడు. ఇక సినిమా విషయానికి వస్తే ఒరిస్సా షెడ్యూల్ పూర్తయిన తర్వాత.. వారం రోజులు చిన్న బ్రేక్ తీసుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కెన్యా వెళ్లబోతున్నారు టీం. అక్కడ ఒక భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని మళ్లీ హైదరాబాద్ రానున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తిచేయాలని ఫిక్స్ అయిపోయాడు రాజమౌళి. మహేష్ బాబు కూడా ఆయనకు తగ్గట్టుగానే డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఎలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ కూడా ప్లాన్ చేయట్లేదు మహేష్. జక్కన్న కోసం తనకు ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ టైం కూడా త్యాగం చేస్తున్నాడు సూపర్ స్టార్. అందుకే మిగిలిన హీరోల కంటే మహేష్ బాబును కాస్త త్వరగానే రిలీజ్ చేయనున్నాడు జక్కన్న.