Mahesh Babu: గుంటూరు కారం నుంచి మరొకరు అవుట్.. అసలు ఈ సినిమా పూర్తవుతుందా ?
త్రివిక్రం, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారో కానీ సినిమాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సినిమా నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతున్నారు.

Mahesh Babu's Trivikram combination Guntur Karam's cameraman Vinod has left the film
మహేష్‌కు జోడీగా మొదట పూజా హెగ్దేను తీసుకుని తరువాత మార్చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌ను కూడా తీసేసినట్టే అని టాక్ నడుస్తోంది. సినిమా షూటింగ్ కూడా అనుకున్నదానికంటే లేట్ అవుతోంది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి మరొకరు బయటికి వెళ్లిపోయారట. గుంటూరు కారం సినిమాకు కెమెరామెన్‌గా పీఎస్ వినోద్‌ను తీసుకున్నారు. త్రివిక్రం చాలా సినిమాలకు పీఎస్ వినోద్ కెమెరామేన్‌గా చేశాడు. వినోద్ త్రివిక్రంకు నమ్మిన వ్యక్తి కూడా. కానీ గుంటూరు కారం షెడ్యూల్స్‌లో మార్పులు రావడంతో అనుకున్నదానికంటే షూటింగ్ లేటయ్యింది.
ఈ కారణంగానే పీఎస్ వినోద్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం వినోద్ ఇచ్చిన డేట్స్ వచ్చే నెలతో పూర్తి కాబోతున్నాయి. కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా సగం కూడా కాలేదు. దీంతో వినోద్‌ను రవి కె చంద్రన్‌తో రీప్లేస్ చేయబోతున్నాడట త్రివిక్రం. ఈ సినిమాకు వస్తున్న వరుస అడ్డంకులతో మహేష్ ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆగిపోయిందంటూ చాలా సార్లు పుకార్లు కూడా వచ్చాయి. దర్శక నిర్మాతల క్లారిటీతో ఆ పుకార్లకు చెక్ పడింది. కానీ ప్రాజెక్ట్ నుంచి ఒక్కొక్కరుగా ఇలా బయటికి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ సినిమా పూర్తై రిలీజ్ అవుతుందా అంటూ వర్రీ అవుతున్నారు.
అసలే త్రివిక్రం మహేష్ కాంబినేషన్‌లో ఒక్క హిట్ కూడా లేదు. ఇప్పుడు గుంటూరు కారం సినిమా మీద ఫ్యాన్స్ ఇన్ని ఆశలు పెట్టుకుంటే సినిమాకు వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దాటుకుని సినిమా పూర్తవ్వడమే పెద్ద టెన్షన్ అనుకుంటే.. రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఫ్యాన్స్‌కు మరో టెన్షన్‌గా మారింది.