Mahesh Jakkanna : మహేష్ డబుల్ రోల్… జక్కన్న నా మజాకానా
మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారం (Guntur Karam) తో తన సత్తా చాటాడు. టాక్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు రాజమౌళి తో చెయ్యబోయే నెక్స్ట్ మూవీ మీద పడింది. దీంతో ఆ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నిమిషాల్లో వైరల్ గా మారుతుంది.

Mahesh double role... jakkanna na majakana
మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారం (Guntur Karam) తో తన సత్తా చాటాడు. టాక్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్స్ ని సృష్టించాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు రాజమౌళి తో చెయ్యబోయే నెక్స్ట్ మూవీ మీద పడింది. దీంతో ఆ మూవీకి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నిమిషాల్లో వైరల్ గా మారుతుంది. జక్కన్న (Jakkanna) టీం నుంచి అధికార ప్రకటన రాకపోయినా సరే వైరల్ మాత్రం కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా ఒక రూమర్ ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది.
జక్కన్న మూవీలో మహేష్ డ్యూయల్ రోల్ (Mahesh Dual Role) చేస్తున్నాడనే టాక్ చాలా బలంగానే వినపడుతుంది. అంటే ఇద్దరు మహేష్ లు మూవీలో మెరవనున్నారు. ఇప్పడు ఈ వార్త సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారం అవుతుంది. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగనే చెప్పవచ్చు. పైగా మహేష్ పూర్తి స్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంతవరకు డ్యూయల్ రోల్ లో చెయ్యలేదు. కాకపోతే బాలనటుడిగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన కొడుకు దిద్దిన కాపురం లో డ్యూయల్ రోల్ లో కనిపించాడు. మహేష్ బర్త్ డే (Mahesh Birthday) సందర్భంగా ఆగస్ట్ 9న మూవీ స్టార్ట్ అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ మూవీ కథ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది. ఈ విషయం మీద కూడా చాలా జోరుగానే చర్చ జరుగుతుంది. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ గా మూవీ ఉండబోతుందని తెలుస్తుంది.ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ మూవీ కథ గురించి వివరణ ఇచ్చాడు. రాజమౌళి, నేను దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. ఆయన పుస్తకాల ఆధారంగానే మహేష్ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశాను. కాకపోతే రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుందంటు చెప్పుకొచ్చాడు.