దేవర దెబ్బ, వణుకుతున్న మహేష్ ఫ్యాన్స్

రాజమౌళితో సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టే పరిస్థితి వస్తోంది. ఆయనతో చేసిన సినిమా సూపర్ హిట్ అవుతున్నా తర్వాతి సినిమాల రిజల్ట్ మాత్రం చుక్కలు చూపిస్తుంది ఫ్యాన్స్ కి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2024 | 01:14 PMLast Updated on: Sep 27, 2024 | 1:14 PM

Mahesh Fans Fear With Rajamouli Movie

రాజమౌళితో సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టే పరిస్థితి వస్తోంది. ఆయనతో చేసిన సినిమా సూపర్ హిట్ అవుతున్నా తర్వాతి సినిమాల రిజల్ట్ మాత్రం చుక్కలు చూపిస్తుంది ఫ్యాన్స్ కి. అది పెద్ద హీరో అయినా సునీల్ లాంటి చిన్న హీరో అయినా ఎవరిని వదలడం లేదు ఆ సెంటిమెంట్. ఇప్పుడు ఎన్టీఆర్ కు చుక్కలు చూపిస్తుంది రాజమౌళి సెంటిమెంట్. 2 ఏళ్ళ పాటు నానా కష్టాలు పడిన సినిమా దారుణంగా ఉందనే టాక్ రావడంతో ఫ్యాన్స్ ఇప్పుడు కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంచనాలకు సినిమాకు సంబంధం లేదు అంటున్నారు జనాలు.

ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కి భయం మొదలయింది. ప్రస్తుతం రాజమౌళి… మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా మొదలయింది. వచ్చే ఏడాది సినిమా గ్రాండ్ గా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా రిజల్ట్ పై ఫ్యాన్స్ కి ఏ మాత్రం భయం లేదు. కాని తర్వాతి సినిమాలపైనే ఫ్యాన్స్ లో భయం ఉంది. వాస్తవంగా చూసుకుంటే మహేష్ బాబుకి గత మూడు నాలుగు సినిమాలు ఆశించిన హిట్స్ కాదు. గుంటూరు కారం సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది.

సర్కారు వారి పాట హిట్ అన్నారు గాని సినిమా చూసిన వాళ్లకు మాత్రం నచ్చలేదు. రాజమౌళి సినిమా హిట్ అయినా తర్వాతి సినిమాలపై ఆ సెంటిమెంట్ ప్రభావం గట్టిగానే ఉండే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. ఇప్పటికే సెంటిమెంట్ దెబ్బకు రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ వంతు అయిపోయి ఇప్పుడే కాస్త బయటకు వస్తున్నారు. కాబట్టి మహేష్ బాబు చాలా జాగ్రత్తగా ఉండాలని తొందరపడి రిస్క్ లు చేయవద్దని కోరుతున్నారు. కాగా మహేష్ బాబు ఈ సినిమా కోసం జుట్టు భారీగా పెంచిన సంగతి తెలిసిందే.