మహేష్ కు ఆ దమ్ము ఉంది.. మహేష్ కోసం 2 వేల కోట్ల కథ రాసా
మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ సినిమా గురించి ఎవరు ఏది మాట్లాడినా వైరల్ అయిపోతుంది.

మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ సినిమా గురించి ఎవరు ఏది మాట్లాడినా వైరల్ అయిపోతుంది. రాజమౌళి సినిమా అనగానే జనాల్లో పిచ్చి ఉంటుంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆ పిచ్చి కాస్త వెర్రిగా మారింది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో జనాలు సోషల్ మీడియాలో హడావుడి పెంచేశారు. ఈ సినిమా గురించి ఎలక్ట్రానిక్ మీడియా కూడా రోజుకో అప్డేట్ ఇస్తూ జనాల్లో ఇంట్రెస్ట్ మరింత పెంచుతోంది.
మహేష్ బాబు కెరీర్ లోనే అడ్వెంచర్ కథ మొదటిసారి చేస్తున్నాడు. దీనితో హడావుడి వేరే రేంజ్ కు వెళ్ళింది. ఇప్పటివరకు థమ్సప్ యాడ్స్ లో అడ్వెంచర్లు చేసిన మహేష్ బాబు.. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా సినిమాలో అడ్వెంచర్లు చేయడానికి రెడీ అయిపోయాడు. అందుకోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. హిమాలయాల్లో కూడా వర్కౌట్స్ చేసాడు మహేష్ బాబు. మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టాడు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఆరేళ్ల టైం ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఆమె కూడా ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లపాటు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం గట్టిగానే ప్రియాంక చోప్రా, మహేష్ బాబు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను కేల్ నారాయణ.. దుర్గా బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమా కావటంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. రాజమౌళి అడిగిన వాటికి ఆయన నో చెప్పడం లేదు. ఇక ఈ సినిమా కథ రాసిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అసలు మహేష్ బాబుతో ఈ కథనే ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన బయటపెట్టారు. ఇండియన్ సినిమాలో అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు రాలేదని, సరిగ్గా ఎక్స్ప్లోర్(explore) కూడా చేయలేదన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఇండియా వైపు చూస్తుందని… ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు బయటపెట్టారు. అలాగే మహేష్ బాబు ఇప్పటివరకు ఈ జానెర్ ను టచ్ చేయలేదని, కాబట్టి ఈ కథ మహేష్ బాబుకు సూట్ అవుతుందని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా విదేశాల్లోనే షూటింగ్ చేస్తామని, సినిమాలో 20 నుంచి 30% మాత్రమే ఇండియాలో షూటింగ్ అవుతుందని తెలిపారు. ఇక కెన్యాలో షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. తాను రాసిన కథను రాజమౌళి… ఎక్కడా మార్పులు చేయడం లేదని, సినిమా తాను అనుకున్నట్లే రాబోతున్నట్లు కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదని విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ పక్కన హీరోయిన్ కోసం మరో ఇంటర్నేషనల్ బ్యూటీని రాజమౌళి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.