Mahesh ssmb 29 : మహేష్ తోఇండోనేషియా బ్యూటీ

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాపోయినా.. కలెక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది.. ఇక.. ఈ మూవీ తర్వాత రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2024 | 10:13 AMLast Updated on: Feb 12, 2024 | 10:13 AM

Mahesh Is The Beauty Of Indonesia

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాపోయినా.. కలెక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది.. ఇక.. ఈ మూవీ తర్వాత రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ మూవీపై మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.. ఈ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి.. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. మహేష్ తో జ‌క్కన్న తీస్తున్న ఈ గ్లోబల్ మూవీలో ఇండోనేషియా నటి ఓ కీలక పాత్రలో చేయబోతుందని వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది..

దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీని పాన్ వరల్డ్ (Pan World Movie) గా ఆఫ్రికన్ ఫారెస్టుల బ్యాక్ డ్రాప్‌లో తెరెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో.. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.బాలీవుడ్ హీరోయిన్ నే జక్కన్న తీసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది.. అయితే.. ఇప్పుడు మహేష్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ని రాజమౌళి దింపుతున్నట్లు ఓ వార్తా సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అమెరికాలో పుట్టి పెరిగిన ఆమె ఇండోనేషియా (Indonesia) సినిమాల్లో స్టార్ గా పాపులర్ అయింది. డి బాలిక్, రోడి, హబీబి, ఏ కాఫీ ఆఫ్ మైండ్, మేరీ డెవిల్ టేక్ యు లాంటి ఎన్నో సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకుంది. . అందంతో పాటు నటనలోనూ సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టాలో రాజమౌళిని ఫాలో అవుతుందట..దీంతో.. మహేష్‌ సరసన ఈ ఇండోనేషియా బ్యూటీ నటించడం పక్కా అంటూ మహేశ్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి మొదలెట్టేశారు..

కాగా మహేష్ 29వ (ssmb 29) సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో మరింత భారీగా రిలీజ్ కానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా రాజమౌళి పాపులర్ కావడంతో.. ఈ మూవీపై హాలీవుడ్‌లో సైతం భారీ అంచనాలు ఉంటాయనే చెప్పాలి.. ఇప్పటికే చాలామంది హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జక్కన్నపై ప్రశంసలు కురిపించారు.. ఇలాంటి టైమ్‌లో ఇప్పుడు ఈ మూవీలో ఇండోనేషియా భామ భాగమైందన్న వార్త మహేశ్‌ ఫ్యాన్స్‌కు ఉర్రూతలూగిస్తోంది.. అయితే.. ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తుందా.. లేదా మరేదైనా లీడ్‌ రోల్‌లో నటించబోతుందా అన్న ప్రశ్నలకు రాజమౌళే సమాధానం చెప్పాలి మరి..