Mahesh Babu: ఏపీ పాలిటిక్స్ తో.. మహేశ్ బాబు మూవీ టైటిల్ కి గండం..
ఏపీ రాజకీయాలు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా టైటిల్ ని శాసిస్తున్నాయి. నిజమే త్రివిక్రమ్ ఈ మూవీకోసం ఎప్పుడో టైటిల్ రెడీ చేశాడు. కాని ఎనౌన్స్ చేయటానికి మాత్రం భయపడుతున్నాడట. మహేశ్ బాబు కూడా టైటిల్ నచ్చినా, అదెక్క రాజకీయ రంగు పులుముకుంటుందో అన్న డైలామాలో ఉన్నాడట.

Mahesh Babu Movie Titile link with AP Politics
ఇంతకి మహేశ్ తో మాటల మాంత్రికుడు తీస్తున్ని సినిమా టైటిల్ ఏంటంటే అమరావతికి అటు ఇటు.. ఇది ఎప్పుడి నుంచో లీకుల రూపంలో జనాల్లో నానుతున్న టైటిలే.. కాని అఫీషియల్ గా ఈనెల కృష్ణ బర్త్ డే రోజు గ్లింప్స్ తోపాటు టైటిల్ రివీల్ చేయాలనుకుంటోంది సినిమా టీం. కాని అమరావతికి అటు ఇటు అన్న పేరే ఫిల్మ్ టీం ని కంగారు పెట్టిస్తోంది.
అసలే ఏపీలో అమరావతి గోల పెరిగింది. అమరావతి క్యాపిటల్ అని ఒకరు, కాదని ఇంకొకరు.. ఇలాంటి టైంలో అమరావతికి అటు ఇటు అనే టైటిల్ పెడితే.. ఇదేదో టీడీపీకి సపోర్ట్ చేసినట్టవుతుందని, మహేశ్ వైసీపీ అభిమాని అని, మరెలా ఆటైటిల్ పెడతారని ఇలా చర్చ జరుగుతోంది. ఏదేమైనా త్రివిక్రమ్ టైటిల్ విషయంలో ఈ నెల 29 లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే.. ఆమరుసటి రోజే టీజర్ రిలీజ్ చేయాలి కాబట్టి, టైటిల్ డిజైన్చేసి యాడ్ చేయాల్సి వస్తుంది.