Maheshvlook : మ‌హేశ్ నెవ‌ర్ బిఫోర్ లుక్..

ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. ఆ భారీ స‌క్సెస్ త‌ర్వాత ఆయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో చేయ‌బోతున్న మూవీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2024 | 10:16 AMLast Updated on: Mar 08, 2024 | 10:16 AM

Mahesh Never Before Look

ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిచెప్పారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. ఆ భారీ స‌క్సెస్ త‌ర్వాత ఆయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో చేయ‌బోతున్న మూవీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీపై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. స్టోరీ, క్యాస్టింగ్,టెక్నీషియ‌న్స్‌ ఇలా ఈ మూవీకి సంబంధించిన ప్ర‌తి అంశంపై మ‌హేశ్, జ‌క్క‌న్న ఫ్యాన్స్‌తో పాటు కామ‌న్ ఆడియ‌న్స్ కూడా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ప‌ట్టాలెక్క‌ని ఈ మూవీ గురించి ఏ చిన్న అప్‌డేట్ వ‌చ్చినా అది క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌హేశ్ కు చెందిన ఓ లెటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

మ‌హేష్‌ (Mahesh), రాజ‌మౌళి (Rajamouli) క‌ల‌యిక‌లో సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా క‌థ‌పై చాలా రోజులుగా ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌ (Forest backdrop) లో యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఇండియానా జోన్స్ త‌ర‌హాలో నిధి అన్వేష‌ణ నేప‌థ్యంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మ‌రి ఆ రేంజ్‌లో ఉండే మూవీలో మ‌హేశ్ లుక్ ఏ రేంజ్‌లో ఉండబోతుంది అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లే హాలీవుడ్ రేంజ్ మూవీ.. అందులోనూ హాలీవుడ్ హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని లుక్ మ‌హేశ్‌ది. మ‌రి ఇలాంటి మూవీలో మ‌హేశ్ లుక్ అంటే మాట‌లా..? అందుకే ఆడియ‌న్స్‌ను మెస్మ‌రైజ్ చేసే మ‌హేశ్ లుక్ కోసం జ‌క్క‌న్న చాలా క‌స‌రత్తు చేస్తున్నార‌ట‌.. మ‌హేశ్‌పై మూడు నాలుగు లుక్స్ ట్రై చేసిన‌ట్లు స‌మాచారం.. ఇలాంటి టైమ్‌లో రీసెంట్‌గా మహేష్ బాబు సోషల్ మీడియాలో ఫోటో ను షేర్ చేశారు. మహేష్ ఇందులో సూపర్ హ్యాండ్సం గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ లుక్‌లో మ‌హేశ్ ఇర‌గ‌దీస్తున్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మ‌హేశ్ లుక్ నెవ‌ర్ బిఫోర్ అన్న రేంజ్‌లో ఉందంటూ సంద‌డి చేస్తున్నారు. మ‌రి జ‌క్క‌న్న మూవీలో మ‌హేశ్ లుక్ ఇదే అని ఫిక్స‌య్యారో లేదో తెలియ‌దు కానీ.. ప్ర‌జెంట్ మ‌హేశ్ షేర్ చేసిన ఈ మూవీపై మాత్రం ఫ్యాన్స్‌ను అల్ల‌ల్లాడిస్తోంది. ఇక‌.. ఈ ఈ మూవీకి సంబందించిన వివరాలను మేకర్స్ త్వరలో ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం..