మహేష్, నమ్రతలను విడగొట్టిన స్టార్ డైరెక్టర్.. అయ్యో పాపం బాబు..!

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ ఎవరు అంటే అందరికంటే ముందు గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రత. ఈ మధ్యే 20 ఏళ్ల దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు ఈ ఇద్దరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 11:55 AMLast Updated on: Feb 25, 2025 | 11:55 AM

Mahesh The Star Director Who Broke The Modesty

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ ఎవరు అంటే అందరికంటే ముందు గుర్తొచ్చేది మహేష్ బాబు, నమ్రత. ఈ మధ్యే 20 ఏళ్ల దాంపత్యాన్ని పూర్తి చేసుకున్నారు ఈ ఇద్దరు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ పరిచయం చేసిన ఘనత కూడా ఈ ఇద్దరిదే. షూటింగ్స్ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా.. కనీసం ఏడాదికి మూడు నాలుగు సార్లు వెకేషన్ వెళ్లడం అలవాటుగా చేసుకున్నాడు మహేష్. ఇదే మిగిలిన హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. ఎంత పెద్ద సినిమా షూటింగ్ చేస్తున్న కూడా మధ్యలో గ్యాప్ తీసుకొని కుటుంబాన్ని బయటకు తీసుకెళ్లడం మహేష్ బాబుకు ఉన్న అలవాటు. అయితే ప్రతిసారి అలా జరిగింది.. కానీ ఇప్పుడు మాత్రం అది కుదిరేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒకసారి జక్కన్న సినిమాలోకి ఎంట్రీ ఇస్తే జైల్లోకి వచ్చినట్టే. ఆయన రిలీజ్ చేసినప్పుడు బయటకు వెళ్లాలి గాని.. ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్తాను అంటే కుదరదు. అక్కడ ఉన్నది సూపర్ స్టార్ అయినా కూడా రాజమౌళి తన కండిషన్స్ అప్లై అంటాడు. సాధారణంగా నమ్రత ఎక్కడికైనా వెళ్తే కచ్చితంగా వెంట మహేష్ కూడా ఉంటాడు.. కానీ ఇప్పుడు బయట ఎక్కడ చూసినా నమ్రత ఒక్కరే కనిపిస్తున్నారు. తాజాగా దుబాయిలో ఒక పెళ్లికి వెళ్లారు టాలీవుడ్ సెలబ్రిటీస్. అందులో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాగే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత వెళ్లారు. మామూలుగా అయితే వేరే దర్శకుడితో సినిమా చేసినా.. నమ్రతతో పాటు మహేష్ కూడా పక్కనే ఉండేవాడు. కానీ రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి కచ్చితంగా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వచ్చే వీలు ఉండదు. పైగా బాబు పాస్పోర్ట్ తీసుకొని జైల్లో వేసినట్టు ఈ మధ్య ఒక మీమ్ చేశాడు రాజమౌళి. అది చూసి అందరూ కామెడీ అనుకున్నారు కానీ నిజంగానే మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు జక్కన్న.

ఈ లెక్కన ఇప్పటి నుంచి ఆయన ఎప్పుడు బయటికి వెళ్లాలన్నా కూడా అంత ఈజీ కాదు. తన సినిమా లుక్ బయటికి రాకూడదు అనే ఉద్దేశంతోనే మహేష్ బాబును లాక్ చేశాడు దర్శక ధీరుడు. సమ్మర్ లో ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. అప్పటి వరకు మహేష్ బాబును మనం బయట చూడడం అరుదు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన గెటప్ లో కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. అందుకే ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే సినిమాకు భారీ నష్టం వస్తుందని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు జక్కన్న. ఏదేమైనా మహేష్, నమ్రతలను తాత్కాలికంగా విడగొట్టిన ఘనత మాత్రం రాజమౌళికి దక్కుతుంది.