మహేష్ వాయిస్ ఓవర్, ఎన్టీఆర్ విలన్
మహేష్ బాబు వాయిస్ ఓవర్… ఎన్టీఆర్ విలన్… ఆ ఊహే ఒక రేంజ్ లో ఉంది కదా…? ఇప్పుడు అది నిజం అయ్యే సిగ్నల్ బలంగా వస్తోంది. చిన్నా చితకా హీరోకి కాదు… తమిళ సినిమా పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న విజయ్ దళపతి సినిమాకు వీళ్ళు ఇద్దరూ కలిసి పని చేస్తారట. అందుకోసం ఇద్దరికీ భారీగా ఆఫర్ చేసేందుకు నిర్మాణ సంస్థ రెడీ కావడం ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 300 కోట్లకు పైగానే ఉంటుందని టాక్. అసలు ఏంటి ఆ సినిమా… డైరెక్టర్ ఎవరు అనేది చూద్దాం.
విజయ్ దళపతి ప్రస్తుతం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసారు. ఈ సినిమా తర్వాత విజయ్ మరో సినిమా చేయనున్నాడు. ఆ సినిమానే విజయ్ కి ఆఖరి సినిమా. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నా అంటూ హెచ్ వినోద్ ప్రకటన చేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లు గా… సమంతా, మమితా బిజు కనపడితే కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనపడతారు. ఇక విలన్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంప్రదిస్తున్నాడు డైరెక్టర్.
హీరోకి సమానంగా రోల్ ఉంటుందని, ఎక్కడా మీ ఫ్యాన్స్ హర్ట్ బాధ పడే విధంగా ఉండే ఛాన్స్ లేదని, పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయని ఎన్టీఆర్ కు కథ వినిపించేందుకు సిద్దమవుతున్నాడు వినోద్. ఇందుకోసం హైదరాబాద్ కూడా రానున్నాడు. ఈ పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా అందించే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఎలా అయినా సరే ఇది సక్సెస్ కావాలని ప్రశాంత్ నీల్ ద్వారా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం ఎన్టీఆర్ కు 35 కోట్ల వరకు చెల్లించేందుకు నిర్మాణ సంస్థను ఒప్పించాడు. మహేష్ వాయిస్ ఓవర్ కు 8 కోట్ల వరకు ఆఫర్ చేయడం సంచలనం. వచ్చే ఏడాది దసరా సమయానికి ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్.