మహేష్ వాయిస్ వాల్యూ 12 కోట్లు… ముఫాసా వేరే లెవెల్ కలెక్షన్స్

ఏదేమైనా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. మహేష్ బాబు మాట వింటే ఫాన్స్ కు పూనకాలు వస్తాయి. ఈ విషయం మరోసారి ప్రూవ్ చేసింది ముఫాసా సినిమా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 09:15 PMLast Updated on: Dec 27, 2024 | 9:15 PM

Maheshs Voice Worth 12 Crores Mufasas Collections Are On A Different Level

ఏదేమైనా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. మహేష్ బాబు మాట వింటే ఫాన్స్ కు పూనకాలు వస్తాయి. ఈ విషయం మరోసారి ప్రూవ్ చేసింది ముఫాసా సినిమా. ఈ సినిమా వసూళ్లు తెలుగులో భారీగా ఉండటం.. హాలీవుడ్, బాలీవుడ్ గాని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా మాస్ సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. ఇండియా వైడ్ గా ఈ సినిమాకు చాలా మంచి క్రేజ్ వచ్చింది. డిసెంబర్ 24 రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ వీక్ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ తో బయటపెట్టింది. ఇండియా వైడ్ గా ఫస్ట్ వీక్ మొత్తం 74 కోట్లు సినిమా వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం తెలుగు భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ వీక్ లో ఇంగ్లీష్ వర్షన్ లో ఇండియాలో 26.75 కోట్లు వచ్చాయి. హిందీలో 11.2 కోట్లు వచ్చాయి. ఇక తెలుగులో 11.3 కోట్ల కలెక్షన్స్ రాగా ఇండియా వైడ్ గా 74.2 రెండు కోట్లు వసూలు చేసింది. తెలుగులో మహేష్ బాబు టైటిల్ రోల్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ఆడియన్స్ లో సినిమా పై పిచ్చ క్రేజ్ పడింది.

ఈ సినిమాకు వేరే కంట్రీస్ లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్నా… ఇండియాలో మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 1750 కోట్ల రూపాయలు కాగా మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ గా 1700 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. మన తెలుగు ఆడియన్స్ వేరే సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాను ఎక్కువగా ఆదరించారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమాకు భారీగా వెళ్లడం కలిసి వచ్చింది. రిలీజ్ రోజు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కొంతమంది పిల్లిని తీసుకొని కూడా సినిమాకి వెళ్లారు.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా హిందీ వర్షన్ లో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రహం వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో సింబా పాత్రకు షారుక్ పెద్దకొడుకు ఆర్యన్ కన్ వాయిస్ ఇవ్వడం గమనార్హం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిలిం ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా ముఫాసా రిలీజ్ అయింది. ఈ వీకెండ్ కూడా భారీగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పుష్ప సినిమా క్రేజ్ కాస్త తగ్గడంతో ఈ సినిమాకు వసూళ్లు పెరుగుతున్నాయి.