Yathra 2 Movie: యాత్ర 2 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. వై ఎస్ జగన్ పాత్రలో కనిపించేది ఇతనే..

ప్రస్తుతం ఎటు చూసినా రాజకీయల్లో యాత్రలు ఎక్కువయ్యాయి. అది బస్సు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు. వీటికి మన తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ సెట్ చేసింది మాత్రం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పాలి. ఈయన పై యాత్ర పేరుతో ఒక బయోపిక్ కూడా వచ్చింది. పెద్ద ఎత్తున ప్రేక్షకుల మదిని దోచుకుంది. అయితే తాజాగా అతని కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ యాత్ర - 2 ను సీక్వెల్గా తెరకెక్కిచనున్నట్లు తెలుస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2023 | 05:17 PMLast Updated on: Jul 02, 2023 | 5:17 PM

Mahi V Raghavas Film Yatra 2 Is Based On Ys Jagan Mohan Reddys Padayatra

గతంలో వచ్చిన యాత్ర సినిమా వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ సీక్వెల్ లో వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నడుమ కొన్ని శక్తులకు ఎదురీది జగన్మోహన్ రెడ్డి ఎలా ధైర్యంగా నిలబడగలిగాడు అనే లైన్ తో ప్రారంభం అవనుంది. ఓదార్పు యాత్ర మొదలు ప్రజా ప్రస్థానం పాదయాత్ర మీదుగా సినిమా సాగనుంది. ఇడుపులపాయ మొదలు ఇచ్ఛాపురం వరకు దాదాపు 3648 కిలోమీటర్ల సుదీర్ఘపాదయాత్రను బేస్ గా చేసుకొని వైఎస్ జగన్ సీఎం జగన్ గా ప్రమాణస్వీకారం చేసే వరకూ ఉంటుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. వీటన్నింటినీ నిజం చేస్తూ చిత్రయూనిట్ తాజాగా ఒక పోస్టర్ ని విడుదల చేసింది.

వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8న యాత్ర – 2 కి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారనుకుంటే అనుకున్న సమయానికన్నా వారం ముందుగా ఒక పోస్టర్ విడుదల చేసి వైఎస్ఆర్ కుటుంబ అభిమానలతోపాటూ, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశాడు చిత్ర దర్శకుడు మహి వి. రాఘవ. 2024 ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది అని తేదీతో సహాప్రకటించేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో యాత్ర అని పాదముద్రలో రెండు అనే అంకెను చేర్చారు. వైఎస్ఆర్ తనదైన శైలిలో చేతిని ఎత్తి అభివాదం చేస్తున్న చిత్రాన్ని చూపించారు. దీనికి కింది భాగంలో.. జగన్ తన బాడీ లాంగ్వేజ్ తో నమస్కారం చేసే స్టిల్ తో పోస్టర్ తయారు చేశారు.

ఇక సినిమా విడుదల వివరాలతో పాటూ ఒక సందేశాన్ని కూడా చెప్పకొచ్చారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టెకోండి.. నేను వై. ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని’ అని అక్షరాలతో హీరోఇజంను ఎలివెంట్ చేశారు. ఈ సినిమాకి సంగీతాన్ని ప్రముఖ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించనున్నారు. ఇక అసలు విషయానికి వస్తే సీఎం జగన్ పాత్ర పోషించేది ఎవరని గత కొంత కాలంగా చర్చ సాగుతుంది. ఒకప్పుడు అక్కినేని నాగార్జున జగన్ గెటప్ లో కనిపించనున్నట్లు పుకార్లు షికారు చేశాయి. తాజాగా తమిళ హీరో, రంగం సినిమాలో ఫోటో జర్నలిస్ట్ పాత్ర పోషించి అభిమానుల మనసును గెలుచుకున్న జీవి పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా రాజకీయంగా ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

T.V.SRIKAR