మజాకా’ రివ్యూ.. ఏంటి ఈ సినిమాను చిరంజీవితో చేద్దామనుకున్నారా.. తీయాల్సింది అప్పుడు తెలిసేది..!

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి.. వాళ్ళు కలిసినప్పుడు కచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు త్రివిక్రమ్ విజయభాస్కర్, కోన వెంకట్ శ్రీను వైట్ల ఉండేవాళ్ళు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 12:20 PMLast Updated on: Feb 26, 2025 | 12:20 PM

Majaka Review

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి.. వాళ్ళు కలిసినప్పుడు కచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు త్రివిక్రమ్ విజయభాస్కర్, కోన వెంకట్ శ్రీను వైట్ల ఉండేవాళ్ళు. అలా ఇప్పుడు ప్రసన్నకుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కిన ఉన్నారు. వాళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎంటర్టైన్మెంట్ ఖాయం అని ఆడియన్స్ నమ్ముతున్నారు. తాజాగా వాళ్ళ కాంబోలో వచ్చిన సినిమా మజాకా. మరి ఇది ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం..

కథ విషయానికి వస్తే.. రావు రమేష్, సందీప్ కిషన్ తండ్రి కొడుకులు. సీన్ ఓపెన్ చేయగానే వైజాగ్ బీచ్ లో తాగి పడిపోయి ఉంటారు. పోలీసులు వాళ్లను స్టేషన్ కి తీసుకెళ్లి ఏం జరిగిందో చెప్పమంటారు. కట్ చేస్తే సందీప్ కిషన్ పుట్టగానే అమ్మ.. అంటే రావు రమేష్ భార్య చనిపోతుంది. అప్పటినుంచి ఇంట్లో ఆడవాసన అంటూ ఉండదు. దాంతో కొడుక్కి పెళ్లి చేసి కోడలు తీసుకొచ్చి కూతురులా చూసుకోవాలి అనుకుంటాడు. అయితే ఆడ దిక్కు లేని ఇంటికి తమ ఆడపిల్లను పంపించలేము అంటూ ఎవరు పిల్లనివ్వరు. అదే సమయంలో అన్షును చూసి ప్రేమలో పడతాడు రావు రమేష్. మరోవైపు రీతు వర్మను చూసి సందీప్ కిషన్ ప్రేమిస్తాడు. అయితే ఇద్దరి ప్రేమకు అనుకోకుండా ఒక అడ్డంకి వస్తుంది. పెళ్లికి ఎలాంటి సమస్య లేకపోయినా.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా కూడా.. తండ్రి కొడుకుల ప్రేమకు ఒక కొత్త సమస్య అడ్డుపడుతుంది. మరి అదేంటి.. వీళ్ళ కథలోకి మురళీ శర్మ ఎందుకు వచ్చాడు అనేది అసలు కథ..

స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. టైం బాగున్నపుడు రొట్ట సినిమా కూడా గొప్ప సినిమాలా కనిపిస్తుంది. అలాగని నేను రాసిందే సీన్.. తీసిందే సినిమా అంటే ఎలా..? వర్కవుట్ అయితే ధమాకానే.. సీన్ సితార అయితే సినిమా మజాకా అవుతుంది. ఎంత కన్వీనియెంట్ గా కథ రాసుకున్నారు అంటే..
ఇక్కడ ఓ పాట రావాలంటే వచ్చేస్తుంది.. ఓ ఎమోషనల్ సీన్ పడాలి అంటే పడుతుంది.. కామెడీ సీన్ వచ్చి చాలా సేపైంది.. ఓ కామెడీ బిట్ పడాలి.. ఇలా ఏది అనుకుంటే అది రాశారు. తీస్తుంది రొటీన్ కథ అని తెలిసినప్పుడు.. స్క్రీన్ ప్లేలో కాస్తైనా మ్యాజిక్ ఉండాలి. మ్యాజిక్ పక్కన పెడితే.. అసలు స్క్రీన్ మీద ఏం చూస్తున్నామో అర్థం కాలేదు కాసేపు..! పాట ఎందుకొస్తుందో తెలియదు.. ఎమోషన్ ఏంటో అర్థం కాదు.. కామెడీకి నవ్వు రాదు. ఫస్ట్ హాఫ్ కొంతైనా బెటర్.. ఒకటో రెండో జోకులు పేలాయి.. సెకండ్ హాఫ్ అమ్మో..! అన్నీ కలిసొచ్చినపుడు ఇలాంటి కథలతోనే హిట్ కొట్టారు ప్రసన్న కుమార్, త్రినాధరావు నక్కిన.
కానీ ఈసారి మాత్రం వాళ్ళ ప్లాన్ వర్కవుట్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. ఈ సినిమాను చిరంజీవితో చేయాలి అనుకున్నారు అనే టాక్ వచ్చింది. కానీ ఆ ఊహే ఫ్యాన్స్ కు చాలా భయం తెప్పించేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే.. రావు రమేష్ తో చేయించిన కొన్ని సీన్స్ కు నవ్వాలా.. ఏడవాలో తెలియదు. అంత మంచి నటుడితో.. కామెడీ పేరుతో ఏంటి ఈ సీన్స్ అనిపించింది. ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇక సందీప్ కిషన్ స్క్రీన్ మీద ఎనర్జిటిక్ గా కాకపోతే ఈ సినిమా ఆయన కథ విని కాదు.. కాంబినేషన్ చూసి ఓకే చేసుంటాడు అనిపిస్తుంది. రీతు వర్మ, మన్మధుడు ఫేమ్ అన్షు ఉన్నారంటే ఉన్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటింగ్ చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు కానీ ఎందుకో మరి అలాగే వదిలేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. త్రినాధరావు, ప్రసన్న మ్యాజిక్ ఈసారి పని చేయడం అనుమానమే..

ఓవరాల్ గా మజాకా.. నో స్టోరీ.. నో లాజిక్.. పరమ రొటీన్..!