Renjusha Menon: ప్రముఖ నటి అనుమానాస్పద మృతి..
మలయాళ హీరోయిన్ రెంజుషా మీనన్ మరణవార్త.. దక్షిణాది సినిమా పరిశ్రమను కుదిపేసింది. ఆమె తన నివాసంలో ఉరివేసుకొని మరణించడం విషాదంగా మారింది. రెంజుషా మీనన్ మృతివార్తను ఆమె భర్త మనోజ్ మీడియాకు వెల్లడించారు.

Renjusha Menon: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సినిమాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న నటి.. ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం సినీ వర్గాలు, అభిమానులను, శ్రేయోభిలాషులను దిగ్బ్రాంతికి గురి చేసింది. మలయాళ హీరోయిన్ రెంజుషా మీనన్ మరణవార్త.. దక్షిణాది సినిమా పరిశ్రమను కుదిపేసింది. ఆమె తన నివాసంలో ఉరివేసుకొని మరణించడం విషాదంగా మారింది. రెంజుషా మీనన్ మృతివార్తను ఆమె భర్త మనోజ్ మీడియాకు వెల్లడించారు.
ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. రెంజూష మీనన్ మరణానికి కారణం ఆర్థిక సమస్యలే అనే విషయం తెలుస్తోంది. ఆమె కుటుంబం కొద్దికాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే ఆర్థిక సమస్యలే ఆమె మరణానికి కారణమా.. మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌కు తరలించి.. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొచ్చికి చెందిన రెంజుషా.. టెలివిజన్ షోల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. స్త్రీ అనే సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి వచ్చింది రెంజుషా. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. సిటీ ఆఫ్ గాడ్, మేరిక్కుందోరు కుంజాడు, బాంబే మార్చ్, కార్యస్థాన్, ఒన్ వే టికెట్, అద్బుత ద్వీపులాంటి సినిమాల్లో రెంజుషా యాక్ట్ చేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఈమె బాగా కనెక్ట్ అయింది. మలయాళ సినీ పరిశ్రమలో సూసైడ్ వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయ్.
మలయాళ నటి అపర్ణ నాయర్ ఈ మధ్యే ఆత్మహత్య చేసుకొన్నారు. అపర్ణ నాయర్ మృతి వార్త నుంచి తేరుకోక ముందే ప్రస్తుతం రెంజుషా మీనన్ మృతివార్త మరింత విషాదాన్ని నింపింది. యువ నటి మృతివార్తతో దిగ్బాంతికి గురైన సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.