Malayalam villains : మలయాళం విలన్స్‌కి మామూలు డిమాండ్ కాదు..

టాలీవుడ్‌లో ఒకప్పుడు విలన్‌ అంటే బాలీవుడ్ నటుడే. ఇప్పుడు సీన్ మారింది. మలయాళ నటుడు అనేంతగా పరిస్థితి ఏర్పడింది. ఎంత పేరున్న హీరోనైనా సరే విలన్‌గా చూపించేందుకు తెలుగు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు మలయాళ విలన్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత తగ్గింది. విలన్స్‌కి షార్టేజ్ ఎక్కువైంది. రావు రమేష్, జగపతిబాబు క్యారెక్టర్ వేషాలకు మొగ్గు చూపడం, ప్రకాష్‌రాజ్‌ రొటీన్ అనే భావన ఏర్పడటంతో.. ఇతర భాషల నుంచి ప్రతినాయకులను తీసుకురావాల్సి వస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 11:09 AMLast Updated on: Dec 13, 2023 | 11:09 AM

Malayalam Villains Are Not In Demand

టాలీవుడ్‌లో ఒకప్పుడు విలన్‌ అంటే బాలీవుడ్ నటుడే. ఇప్పుడు సీన్ మారింది. మలయాళ నటుడు అనేంతగా పరిస్థితి ఏర్పడింది. ఎంత పేరున్న హీరోనైనా సరే విలన్‌గా చూపించేందుకు తెలుగు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు మలయాళ విలన్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత తగ్గింది. విలన్స్‌కి షార్టేజ్ ఎక్కువైంది. రావు రమేష్, జగపతిబాబు క్యారెక్టర్ వేషాలకు మొగ్గు చూపడం, ప్రకాష్‌రాజ్‌ రొటీన్ అనే భావన ఏర్పడటంతో.. ఇతర భాషల నుంచి ప్రతినాయకులను తీసుకురావాల్సి వస్తోంది. అయితే ఈ గ్యాప్‌ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు మల్లూవుడ్ స్టార్స్. ఇప్పటికే రిలీజైన దసరాలో.. నానికి దీటుగా ఉండడానికి షైన్ టామ్ చాక్‌ని బరిలో దించాడు శ్రీకాంత్ ఓదెల. రంగబలిలోనూ విలన్‌గా చేశాడు. ఐతే అది డిజాస్టర్ కావడంతో ఆఫర్లపై ప్రభావం పడింది. ఆదికేశవ కోసం మల్లువుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న జీజు జార్జ్‌ని ఏరి కోరి మరీ తీసుకొచ్చాడు డైరెక్టర్. మలయాళంలో హీరోగా నటిస్తూనే.. తెలుగులో విలన్‌గా ఫిక్స్ అయ్యే విధంగా సినిమాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు.

Deol Family : డియోల్‌ ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చాయా ?

ప్రజెంట్ జోజు తో ముగ్గురు తెలుగు దర్శకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పుష్ప మనకు దగ్గరైన ఫహద్ ఫాసిల్ కూడా కేరళ బ్యాచే. ఫస్ట్ పార్ట్‌లో భన్వర్ సింగ్ షెకావత్‌గా తనదైన మార్క్ చూపించాడు. ఇప్పుడు పుష్ప2 తో మరింత వైలెంట్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక మల్లూవుడ్‌లో హీరో కమ్‌ డైరెక్టర్‌గా సందడి చేస్తున్న పృథ్వీరాజ్ కూడా టాలీవుడ్‌ లో విలన్‌ వేషాలకు ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్‌లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. టైగర్ నాగేశ్వరరావులో కీలకమైన పాత్రలో నటించిన సుదేవ్ నాయర్.. ఇప్పుడు నితిన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. తండ్రి, విలన్ వేషాలు బాగా పడుతున్న జయరాం కూడా కేరళ బ్యాచే. వీళ్లంతా మలయాళంలో బిజీగా ఉన్నా.. తెలుగు అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కాకపోతే ఒకప్పుడు హిందీ నుంచి వచ్చిన షియాజీ షిండే, ఆశిష్ విద్యార్ధిలాగా గట్టి జెండా పాతలేకపోతున్నారు. ఫహద్ ఒకడే అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తానికి మలయాళం విలన్లు క్రమంగా టాలీవుడ్ తెరను ఆక్రమించే పనిలో బిజీ అయ్యారు.