Yesh: ప్రభాస్ చేసింది తప్పని తెలుసు.. ఐనా అదే తప్పు చేస్తున్న రాఖీ భాయ్..
యంగ్ రెబల్ స్టార్ చేసిన తప్పునే కన్నడ స్టార్ యష్ అలియాస్ రాఖీ భాయ్ చేస్తున్నాడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే కామెడీగా ఉంటుంది. అలానే చీమ మీద పులి స్వారి చేయాలనుకుంటే కూడా అంతే కామెడీగా ఉంటుంది.. అదే పని చేసి ప్రభాస్ ఓ సారి కాదు రెండు సార్లు చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు కేజీయఫ్ ఫేం యష్ కూడా అలాంటి రిస్కే చేస్తున్నారు.

Malayali Director Geethu Mohan das and Kgf Hero Yesh Combo Movie will starts soon
ప్రభాస్ కి రాధేశ్యామ్ ఓ పెద్ద గుణపాఠం. గతంలో ఇలానే చక్రం అంటూ తన ఇమేజ్ ని పక్కన పెట్టి ప్రయోగం చేశాడు. ఆ కటౌట్ నడిచొస్తుంటేనే కాసుల వర్షం కురుస్తుంది. అలాంటి తను, పూర్తి గా ఇమేజ్ ని పక్కన పెట్టి చక్రం లాంటి సూట్ కాని కథతో రిస్క్ చేశాడు. బాహుబలి 1,2 , సాహోతో పాన్ ఇండియా సూపర్ హీరోగా మారాక కూడా, రాధేశ్యామ్ లాంటి విషయంలేని ప్రేమకథలో కనిపించారు.
ఒక్కోసారి ఓరేంజ్ ఇమేజ్ వచ్చాక, చిన్నా చితకా పాత్రలు, లేదంటే ప్రేమకథలు చేస్తే ఏనుగు కాళ్ల కింద చీమ నలిగినట్టు, సినిమా కూడా నలిగిపోతుంది. అందుకే కేజీయఫ్ తో మరో ప్రభాస్ అనేంతగా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న యష్, ప్రభాస్ లానే ప్రేమకథకి సై అంటే పంచ్ పడటం పక్కా అంటున్నారు. గీతూ మోహన్ దాస్ మేకింగ్ లో యష్ ప్రేమ కథా చిత్రం చేయబోతున్నాడనే సరికి ఫ్యాన్స్ లో కంగారు పెరిగింది. లార్జర్ దేన్ లైఫ్ అనిపించే సినిమాలకు తప్ప, చిన్న సినిమాలకు ప్రభాస్, యష్ లాంటి స్టార్ల ఇమేజ్ అడ్డొస్తుంది. అలాని భారీ సెట్లు, గ్రాఫిక్స్ పెట్టి ఓ మాదిరీ ప్రేమకథని, రాధేశ్యామ్ లా తీసినా పంచ్ పడుతుంది. ఇన్ని తెలిసి యష్ కూడా ప్రభాస్ దారిలో ప్రేమ కథ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మీదే అనుమానాల, కామెంట్లు పెరిగాయి.