Director: మల్లారెడ్డి కామెంట్స్‌తో హరీష్ శంకర్‌కు చీవాట్లు
తెలంగాణ మినిస్టర్ మల్లారెడ్డి చేసిన కామెంట్స్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు క్లాస్ పడేలా చేశాయి. జనరల్‌గా మల్లారెడ్డి గెస్ట్‌గా వస్తున్నాడంటే ఆడియన్స్ అంతా అలెర్ట్‌గా ఉంటారు. మల్లారెడ్డి వేసే పంచులు, చెప్పే జోకులు ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. ఇలాగే ఓ ఫంక్షన్‌కు వెళ్లిన మల్లారెడ్డి.. ఆడియన్స్‌తో సరదాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాలో తనను విలన్‌గా హరీష్ శంకర్ అడిగాడని చెప్పారు. దాదాపు గంటన్నర బతిమాలినా తాను సినిమా ఒప్పుకోలేదని చెప్పారు.
ఈ మ్యాటర్ ఇంటర్నెట్‌లో తెగ వైరలైంది. ఇదే మ్యాటర్‌లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్‌కు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా మల్లారెడ్డిని ఎందుకు సినిమాలో చేయమని అడిగావంటూ హరీష్ మీద సీరియస్ అయ్యారట పవన్ కళ్యాణ్. పొలిటికల్ ఇష్యూస్ వస్తాయనే కారణంతోనే ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ లీడర్. బీజేపీకి ఫుల్ ఆపోజిట్. ఇక పవన్ కళ్యాణ్ ముందు నుంచీ బీజేపీతో మంచి రాపో మెయిన్‌టేన్ చేస్తున్నారు.
ఇప్పుడు బీఆర్‌ఎస్ లీడర్‌ను విలన్‌గా పెడితే ఆడియన్స్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందిని చెప్పారట పవన్. దానికి తోడు మల్లారెడ్డి తెలంగాణ లీడర్, పవన్ కళ్యాణ్ ఆంధ్రా పొలిటీషియన్. ఇది కూడా వీళ్ల కాంబోకు మరో ప్రాబ్లమ్ అవుతుంది. ఏదో ఒక డైలాగ్ వల్ల పొలిటికల్ ఎజెండాలు ముందుకు వస్తాయి. మల్లారెడ్డి నో చెప్పాడు కాబట్టి ఓకే. ఒకవేళ సినిమాకు ఒప్పుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేసేవాడివని హరీష్ శంకర్‌కు క్లాస్ తీసుకున్నాడట పవన్ కల్యాణ్. మొత్తానికి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ వల్ల హరీష్ మాటలు పడాల్సి వచ్చింది.